ట్యాగ్ · 106 కథనాలు · పేజీ 6
'శాకుంతలం' రూమర్స్ పై గుణ శేఖర్ క్లారిటీ
అభినవ శకుంతల సమంత

"శాకుంతలమ్ "గొప్పదనం - గుణ శేఖర్
గుణశేఖర్ "శకుంతలమ్ "మూవీ విశేషాలు
సామ్@11 - శాకుంతలం టీమ్ విషెస్
ఏం మాయ చేసావే సినిమా.. ఈ సినిమాలో తన నటనతో మాయ చేసిన సమంతను ఎవరు మరిచిపోతారు. జెస్సీ పాత్రలో తను నటించింది అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పొచ్చు. తన మాటలు, హావభావాలు, అందం, అభినయం ఇలా అన్నీ కలబోసి కుర్రకారు మదిని దోచింది సమంత. ఆ సినిమాతో మొదలైన సమంత సినీ కెరీర్ ఇప్పటివరకూ సక్సెస్ ఫుల్ గానే కొనసాగింది.
'శాకుంతలం' రూమర్స్ పై గుణ శేఖర్ క్లారిటీ
గుణశేఖర్ పౌరాణిక కథాంశంతో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించాడు గుణశేఖర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఒక రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శకుంతల పాత్రలో సమంత చేయనుండడంతో.. సమంత లాంటి స్టార్ నటి సరసన దుష్యంతుడి పాత్రలో ఏ హీరో నటిస్తాడని విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుష్యంతుడుగా రానాతో పాటు పలువురు ప్రముఖ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.
అభినవ శకుంతల సమంత
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా "శాకుంతలం "మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం" బ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రణయకావ్యం గా రూపొందుతున్న "శాకుంతలం "మూవీ లో కథానాయికగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

"శాకుంతలమ్ "గొప్పదనం - గుణ శేఖర్
దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీనటులతో తెరకెక్కిన "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "చూడాలని ఉంది ", "ఒక్కడు ", "రుద్రమదేవి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో దర్శకుడు గుణశేఖర్ ప్రేక్షకులను అలరించారు. గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో "హిరణ్య కశ్యప "మూవీ రుపొందాల్సి ఉండగా , గుణశేఖర్ "శాకుంతలమ్ "మూవీ ని అనౌన్స్ చేశారు.
గుణశేఖర్ "శకుంతలమ్ "మూవీ విశేషాలు
"లాఠీ " మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన గుణశేఖర్ "సొగసు చూడతరమా " మూవీ తో విజయం సాధించారు. గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీ నటులతో రూపొందిన "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన "చూడాలని ఉంది ", "ఒక్కడు ", "రుద్రమదేవి " వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. "ఒక్కడు "మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా గుణశేఖర్ నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 5 సంవత్సరాల తరువాత గుణశేఖర్ తన కొత్త మూవీ ని అనౌన్స్ చేశారు.
గుణశేఖర్ 'శాకుంతలం'.. 'హిరణ్యకశ్యప' కంటే ముందే
మొదటినుండి గుణశేఖర్ విభన్నమైన సినిమాలు చేస్తూవుండటం చూస్తున్నాం. మనోహరం, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం `హిరణ్యకశ్యప`సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అయితే, సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టడంతో ఈ గ్యాప్ లో మరో సినిమాను లైన్ లో పెట్టాడు గుణశేఖర్. మరో పాన్-ఇండియా సినిమా ‘శాకుంతలం’ చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నారు.