కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Renu Desai New Movie News

ట్యాగ్ · 6 కథనాలు

సినిమా వార్తలు

'ఆద్య' తో వస్తున్న రేణు

చాలా ఏళ్ళ తర్వాత రేణు మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపింది రేణు. ఈ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతలు డిఎస్‌. రావు, ఎస్‌. రజినీకాంత్‌. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్‌.ఆర్‌. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రేణు దేశాయ్ గ్రీన్ ఛాలెంజ్ - ఛాలెంజ్ కాదు అందరూ ముందుకు రావాలి..!

టీఆర్ఎస్‌ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చాలా మంది ఇప్పటికే సెలెబ్రిటీస్ పాల్గొన్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను రేణు దేశాయ్ కూడా పూర్తి చేసింది. సంతోష్‌కుమార్ ప్రారంభించిన 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి రేణు దేశాయ్ జూబ్లీహిల్స్ లోని పార్కులో తన కూతురితో మొక్కలు నాటించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ సినిమాలోనా.. చాలా మంది ఫోన్ చేస్తున్నారు..!

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీంతో ఈ విషయమై తాజాగా రేణు దేశాయ్ స్పందించి ఆమె క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రేణు దేశాయ్ రీ ఎంట్రీ

యాక్ట్రెస్ , ఎడిటర్ , కాస్ట్యూమ్స్ డిజైనర్ , ప్రొడ్యూసర్, డైరెక్టర్ రేణు దేశాయ్ "బద్రి ", "జానీ "," జేమ్స్ పాండు " (తమిళ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఇష్క్ వాలా లవ్ "మరాఠీ మూవీ దర్శకత్వం వహించి , నిర్మించారు. మోస్ట్ ట్యాలెంటెడ్ రేణు దేశాయ్ తెలుగు మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తానని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 18 సంవత్సరాల తరువాత నటించాలనే నిర్ణయం రేణు తీసుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'అకీరా' కు ఇష్టమైన హీరో అతనే..!

స్టార్ హీరోల తనయులకు కూడా ఫెవరేట్ హీరోలు ఉంటారు. తమ తండ్రి పెద్ద హీరో అయినా కూడా వారితో పాటు వారు అభిమానించే హీరో వేరే ఉంటారు. ఇక్కడ ఓ స్టార్ హీరో తనయుడికి కూడా అభిమాన హీరో వేరే ఉన్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో... ఆ తనయుడు ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తనయుడు అకీరా నందన్.

TFN Adminవాట్సాప్
Badri Heroine Renu Desai Ready To Play Mother Roles For Tollywood Top Stars
సినిమా వార్తలు

మహేష్, ప్రభాస్ లకు మథర్ క్యారెక్టర్ అయినా చేస్తా..!

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి హిట్ తో పాటు తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ తోనే జానీ సినిమా చేయడం.. దాని తర్వాత పవన్ ప్రేమ, పెళ్లి చేసుకోవడం ఇలా ఫాస్ట్ గా జరిగిపోవడంతో రేణు దేశాయ్ కు పెద్దగా సినిమా చేసే అవకాశాలు రాలేదు. పవన్ నుండి విడిపోయిన తర్వాత కూడా డైరెక్టర్ గా మారి సినిమా చేసింది కానీ మళ్ళీ నటన వైపు వెళ్ళలేదు. ముఖానికి మేకప్ వేసుకోలేదు. అయితే ఇప్పుడు తనకు అవకాశం వస్తే కనుక నటిస్తానని తానే చెప్తుంది. అది కూడా తల్లి పాత్ర అయినా పర్వాలేదట.

TFN Adminవాట్సాప్

షేర్