ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2
మాస్ మహారాజా సరసన 'ఇస్మార్ట్' భామలు?
పిల్లలతో సరదాగా రవితేజ
రవితేజ ద్విపాత్రాభినయం

మళ్ళీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రవితేజ?
వక్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజ సినిమా
రవితేజ, రమేష్ వర్మతో సినిమా చేస్తున్నాం
మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. నిజానికి ఈ సినిమా ఈ నెల మొదటి వారంలో రిలీజ్ కావాల్సి వుంది కానీ లాక్ డౌన్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
మాస్ మహారాజా సరసన 'ఇస్మార్ట్' భామలు?
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నాడని సమాచారం. కాగా, ఇందులో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా.. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ని ఎంపిక చేసింది చిత్ర బృందం. తాజాగా మరో హీరోయిన్ రోల్ కోసం నభా నటేష్‌ని సెలెక్ట్ చేశారట. త్వరలోనే నభా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
పిల్లలతో సరదాగా రవితేజ
కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ మూవీ షూటింగ్స్, ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉండే సినీ తారలు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోవడంతో ఇళ్ళకే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.
రవితేజ ద్విపాత్రాభినయం
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "క్రాక్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయిక. హీరో రవితేజ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పవన్, రవితేజ కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘వకీల్ సాబ్’లో లాయర్ గా నటిస్తూనే.. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారాయన. ఈ రెండు చిత్రాలతో పాటు.. తన లక్కీ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లోనూ నటించేందుకు సిధ్ధపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ ఓ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

మళ్ళీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రవితేజ?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి `క్రాక్` కాగా.. మరొకటి `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్. ఈ రెండు చిత్రాలతో పాటు... ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ వంటి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించిన త్రినాథరావు నక్కినతో కూడా ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు రవితేజ. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో తమన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
వక్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజ సినిమా
వరుసగా ఓ రెండు ప్లాప్స్ వస్తే చాలు ఆ హీరోకు సినిమాలు రావడం చాలా కష్టం. కానీ మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మే 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.