ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2
రమ్యకృష్ణకి కూతురిగా అనసూయ?

"రంగమార్తాండ" మూవీ లో స్టార్ కమెడియన్

'రంగ మార్తాండ' షూటింగ్ ప్రారంభం
రంగమార్తాండ మూవీలో కీలక పాత్రలో అనసూయ
‘రంగమార్తాండ’లో రంగస్థల నటిగా రంగమ్మత్త?
ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాతగా రాణిస్తూనే.. మరోవైపు వెండితెరపై వెలుగులు పంచుతోంది టాలెంటెడ్ బ్యూటీ అనసూయ. `రంగస్థలం`లోని “రంగమ్మ” పాత్రతో నటిగా మరోమెట్టు ఎదిగిన అను.. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ`లో కీలక పాత్రలో నటిస్తోంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం రంగస్థల నటిగా ఆమె పాత్ర ఉంటుందని తెలిసింది.

"రంగమార్తాండ " మూవీ లో నటుడు గా రాహుల్ సిప్లిగంజ్
సూపర్ హిట్ మూవీస్ ఈగ, రచ్చ, రంగస్థలం, కాంచన 3, RX 100, ఇస్మార్ట్ శంకర్ వంటి మూవీస్ లో తన సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు నటుడిగా అలరించనున్నారు. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3 టైటిల్ గెలుచుకొన్న రాహుల్ సింగర్ గానూ, నటుడి గానూ పలు అవకాశాలను అందుకొంటున్నారు. ఇప్పుడు రాహుల్ "రంగమార్తాండ " మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నట్టు సమాచారం.
రమ్యకృష్ణకి కూతురిగా అనసూయ?
నటన నుంచి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ విషాదకర జీవితంతో తెరకెక్కుతున్న చిత్రం `రంగమార్తాండ`. మరాఠీ బ్లాక్ బస్టర్ `నట సామ్రాట్`కి రీమేక్ గా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ లో నటిస్తుండగా... ఆయనకి జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. బ్రహ్మానందం ఓ ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు అందిస్తున్నాడు.

"రంగమార్తాండ" మూవీ లో స్టార్ కమెడియన్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న "రంగమార్తాండ" మూవీ షూటింగ్ నిన్న వైజాగ్ లో ప్రారంభమయింది. మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న" రంగమార్తాండ" మూవీ ప్రారంభోత్సవం లో డైరెక్టర్ తేజ పాల్గొని ఫస్ట్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్ర కు ఎంపిక అయ్యారు. అభిషేక్, మధు నిర్మాణసారథ్యంలోరూపొందుతున్న"రంగమార్తాండ" మూవీ కి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

'రంగ మార్తాండ' షూటింగ్ ప్రారంభం
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉండగా నేడు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్నీ కృష్ణవంశీ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఫస్ట్ షాట్ ను సెన్సేషనల్ డైరెక్టర్.. నా చిరకాల మిత్రుడు తేజ డైరెక్ట్ చేసాడు.. థాంక్యూ తేజ అంటూ ట్వీట్ చేసాడు.
రంగమార్తాండ మూవీలో కీలక పాత్రలో అనసూయ
సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో రంగమార్తాండ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రంగమార్తాండ మూవీ రూపొందుతుంది 1998 సంవత్సరంలో చంద్రలేఖ మలయాళ మూవీ ని చంద్రలేఖ పేరు తో తెలుగులో రీమేక్ చేసిన కృష్ణ వంశీ తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత మరో రీమేక్ మూవీ కి దర్శకత్వం వహించడం విశేషం.