
ట్యాగ్ · 6 కథనాలు

లెజెండ్ స్పూఫ్ లో 'పృథ్వీరాజ్' కామెడీ
అనారోగ్యంతో హాస్పిటల్ లో 'పృథ్వీరాజ్'

నటుడి కామెంట్స్ ఎఫెక్ట్.. స్పందించిన లైలా టీమ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా'. ఫిబ్రవరి 14న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

మాయా పేటిక రివ్యూ- ఇంట్రెస్టింగ్ సెల్ ఫోన్ కథ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మాయా పేటిక మెసేజ్ తో కూడిన కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

జూన్ 30న థియేటర్లలోకి న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్ 'మాయాపేటిక'
స్మార్ట్‌ఫోన్ నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త థ్రిల్లర్ మూవీ 'మాయాపేటిక'. 'ఆర్ఎక్స్ 100' సినిమా ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విరాజ్ అశ్విన్, రజత్ రాఘవ్, సిమ్రత్ కౌర్ తదితరులు ఇతర తారాగణం. ప్రముఖ నటుడు సునీల్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ మరియు శ్రీనివాస రెడ్డిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై మరింత ఆసక్తి రేకెత్తించింది. కాగా ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తుండగా.. జస్ట్ ఆర్డినరీ…

మంచు మనోజ్ గుంటూరోడు - బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
ఎస్.కె.సత్య దర్శకత్వంలో మంచు మనోజ్, ప్రగ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగాతెరకెక్కిన సినిమా గుంటూరోడు. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీవరుణ్ అట్లూరి నిర్మాతగా తెరకెక్కిన సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోటశ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం DJ శ్రీ వసంత్ అందించగా.. సినిమాటోగ్రఫి సిద్దార్ధరామస్వామి అందించాడు. ఇక ఈ సినిమా అంతగా విజయం దక్కించుకోలేకపోయినా.. కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ మీకోసం.
లెజెండ్ స్పూఫ్ లో 'పృథ్వీరాజ్' కామెడీ
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసి పృథ్వీరాజ్ మంచి కమెడియన్‌గా, నటుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా సినిమాలు చేస్తూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాదు అప్పుడప్పుడు లీడ్ రోల్స్ లో కూడా నటించాడు పృథ్వీ రాజ్. ఈ నేపథ్యంలో మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పృథ్వీ రాజ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఈ సినిమాలో లెజెండ్ స్పూఫ్ లో పృథ్వీ చేసిన కామెడీ కూడా ఎవరూ మరిచిపోలేరు. మరి ఆ కామెడీ వీడియో మీరు కూడా చూసి నవ్వుకోండి.
అనారోగ్యంతో హాస్పిటల్ లో 'పృథ్వీరాజ్'
జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే టాలీవుడ్ కి ప్రస్తుతం బ్యాడ్ డేస్ నడుస్తున్నట్టే తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది మృత్యు వాత పట్టారు. ఇక పలువురు సినీ ప్రముఖులకు కరోనా కూడా వచ్చి పడింది. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో కమెడియన్ కూడా అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది. అతనెవరో కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా పేరుపొందిన పృథ్వీరాజ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.