
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2


సత్యదేవ్ "తిమ్మరుసు" రిలీజ్ డేట్ ఫిక్స్
పవన్ చేతుల మీదుగా 'గమనం' ట్రైలర్ రిలీజ్
మూవీస్ తో ప్రియాంక జవాల్కర్ బిజీ

ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ‘టాక్సీవాలా’ భామ?

ప్రియాంక జవాల్కర్ శారీ లుక్
"కలవరం ఆయే "మూవీ తో మోడల్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ "టాక్సీవాలా "మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న "తిమ్మరుసు "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

సత్యదేవ్ "తిమ్మరుసు" రిలీజ్ డేట్ ఫిక్స్
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో "బ్లఫ్ మాస్టర్ ", "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య "మూవీస్ ఫేమ్ సత్యదేవ్ హీరోగా అసైన్ మెంట్ వాలి ట్యాగ్ లైన్ తో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ "తిమ్మరుసు "మూవీ మే 21 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక జువాల్కర్ కథానాయిక. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
పవన్ చేతుల మీదుగా 'గమనం' ట్రైలర్ రిలీజ్
సుజనా రావు దర్శకత్వంలో శ్రియ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘గమనం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
మూవీస్ తో ప్రియాంక జవాల్కర్ బిజీ
మోడల్ , యాక్ట్రెస్ , ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక జవాల్కర్ చిన్న వయసు లోనే సూపర్ హిట్ "జీన్స్ " మూవీ లో ఐశ్వర్య రాయ్ ను చూసి యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్ &ఇంజనీరింగ్ లో బిటెక్ కంప్లీట్ చేసిన ప్రియాంక కు 2 షార్ట్ ఫిల్మ్స్ లో నటించే అవకాశం వచ్చింది. హైదరాబాద్ లోని ఒక యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ స్కిల్స్ ను ప్రియాంక డెవలప్ చేసుకున్నారు.
సక్సెస్ ను తలకు ఎక్కించుకోవద్దని చిరంజీవి చెప్పారు..!
షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయి టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన తెలుగమ్మాయి ప్రియాంకా జువాల్కర్. మొదటి సినిమాతోనే నటిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు.. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో ఆ సినిమా తర్వాత అవకాశాలు పెరిగిపోతాయని అందరూ భావించారు. కానీ ఈ భామకు అలాంటి అవకాశాలు పెద్దగా వచ్చింది లేదు. అయితే ‘టాక్సీవాలా’ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన ప్రియాంకకు ఎట్టకేలకు మరో ఆఫర్ వచ్చింది.

ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 ప్రారంభం
"రాజా వారు రాణి గారు" మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం, సక్సెస్ ఫుల్ మూవీ "టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ జంటగా రూపొందుతున్న ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ‘టాక్సీవాలా’ భామ?
‘టాక్సీవాలా’ (2018) చిత్రంతో తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది ప్రియాంకా జవాల్కర్. సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ చిత్రంలో... అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ తెలుగమ్మాయి. ఇదిలా ఉంటే... తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక కథానాయికగా ఎంపికైనట్టు టాక్.