
ట్యాగ్ · 6 కథనాలు

ఆనందంలో పూజాహెగ్డే

"హలో ఇటలీ "- పూజాహెగ్డే
'రాధే శ్యామ్' షూట్ కోసం వెయిటింగ్

షూటింగ్ కు రెడీ అయిపోయిన బుట్టబొమ్మ

ఇండియా లోనే బిజీ యాక్ట్రెస్ పూజాహెగ్డే
స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో జోడీ గా నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.
ఆనందంలో పూజాహెగ్డే
దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది. ఇటలీ లో షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. చిన్న సెట్ లో తక్కువ టీమ్ మెంబర్స్ తో కరోనా వైరస్ జాగ్రత్తలతో షూటింగ్ జరుగుతుందనీ , కెమెరా ముందు మాస్క్ తీయాలి కాబట్టి తప్పకుండా కొంత రిస్క్ ఉంటుందనీ , లైఫ్ కొనసాగించాలంటే కొత్త జీవన శైలి కి అలవాటుపడాలనీ , తొలి రెండు రోజులు భయమనిపించినా ఇప్పుడు అంతా ఓకే ననీ చెప్పారు.
రాధేశ్యామ్ నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ రిలీజ్
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధే శ్యామ్. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఇటలీలో షూటింగ్ ను మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నారు టీమ్. అక్టోబర్ నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు.

"హలో ఇటలీ "- పూజాహెగ్డే
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి - సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . ఇటలీ , జార్జియాలలో షూటింగ్ జరుపుకున్న "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.
'రాధే శ్యామ్' షూట్ కోసం వెయిటింగ్
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేస్‌లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఇప్పటికే మొదలైంది. పూజా హెగ్డే, అఖిల్ షూట్ లో పాల్గొంటున్నారు.

షూటింగ్ కు రెడీ అయిపోయిన బుట్టబొమ్మ
మొత్తానికి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలు కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి షూటింగ్ లను ప్రారంభిస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్యాలు అనుమతులు ఇచ్చినా కరోనాకు భయపడి షూటింగ్ లను జరపలేదు. అయితే ఇప్పట్లో కరోనాకు అంతం లేదని భావించి.. తక్కువ మంది స్టాఫ్ తో కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లను జరపడానికి రెడీ అయిపోతున్నారు. ఒక పది. పదిహేను రోజుల పెండింగ్ వున్న సినిమాలు అయితే ఇప్పటికే షూటింగ్ ను మొదలు పెట్టి మిగిలిన షూట్ ను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్స్ అందరూ చిన్నగా హైదరాబాద్ లో వాలిపోతున్నారు. దీనిలో భాగంగానే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా వచ్చేసింది.