ట్యాగ్ · 6 కథనాలు
పవన్ తో సుదీప్ భేటీ

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
క్రిష్ 'అంతర్వాహిని' - పవన్ సినిమా టైటిలా..?

#PSPK27 కోసం హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ డైరెక్టర్
పవర్ స్టార్ 'ఫస్ట్ వాల్ పోస్టర్'
దసరాకు "వకీల్ సాబ్ "మూవీ ట్రీట్ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ఫిలిమ్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అంజలి , నివేద థామస్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. 6 నెలల తరువాత "వకీల్ సాబ్ "మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. దాదాపుగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "వకీల్ సాబ్ "మూవీ లో పవన్ కళ్యాణ్ వర్క్ కొంత బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం.
పవన్ తో సుదీప్ భేటీ
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కన్నడ స్టార్ హీరో సుదీప్ కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఎంత ఇమేజ్ ఉందో కర్నాటకలో సుదీప్ కి అంత ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమా కోసం వీరిద్దరూ భేటీ అయ్యారా..? నార్మల్ గానే భేటీ అయ్యారా? అని ఇప్పటికే పలు వార్తలు వచ్చేసాయి. అయితే వీరిద్దరూ క్యాజువల్ గానే మీట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు ఇద్దరూ సినిమాలు.. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్స్ చేయడం.. ఇంకా సామాజిక అంశాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం. మరి ఎందుకు కలిసారో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి పవన్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. కారణం ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత క్రిష్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ సినిమా మొదలుకానుంది.
క్రిష్ 'అంతర్వాహిని' - పవన్ సినిమా టైటిలా..?
పవర్ స్టార్ తన 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరుపుకోగా కరోనా వలన షూట్ కు బ్రేక్ పడింది. త్వరలో మళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. ఇటీవలే పవన్ బర్త్‌డే సందర్భంగా పవన్ ప్రీ లుక్ విడుదల చేశారు దర్శకుడు క్రిష్. 'వకీల్‌సాబ్' షూటింగ్ పూర్తి కాగానే పవన్, క్రిష్ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవుతుంది.

#PSPK27 కోసం హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 27వ సినిమా క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా 15రోజుల షూటింగ్ ను కూడా జరుపుకుంది. ఇక రేసెంట్ గానే పవన్ పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ లుక్ ను బట్టి ఇది పీరియాడిక్ డ్రామా అని అర్థమైపోతుంది. బ్రిటిష్ వారితో పోరాడే నాయకుడి పాత్రలో పవన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
పవర్ స్టార్ 'ఫస్ట్ వాల్ పోస్టర్'
సినిమా హిట్ ఫట్ తో సంబంధంలేదు.. ఆయన ఉంటే చాలు కలెక్షన్స్ అలా వచ్చేస్తాయి.. అయనకు ఫ్యాన్స్ కాదు ఉండేది భక్తులు.. టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో పవర్ స్టార్ కు ఉన్న ఇమేజ్, క్రేజ్ వేరు.. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్దమయ్యేవుంటది కదా. ఇంకెవరు.. చిరు తమ్ముడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ తో.. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కోట్లమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకొని పవర్ స్టార్ అయ్యాడు. అతడ్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన క్రేజ్…