
ట్యాగ్ · 87 కథనాలు · పేజీ 5


'శ్యామ్ సింగరాయ్' టీజర్ రిలీజ్

'1997' సినిమా టీజర్ రిలీజ్

"దృశ్యం 2" మూవీ అఫీషియల్ టీజర్ రిలీజ్

హీరో సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ "జై భీమ్"

సూర్య 'జై భీమ్' ట్రైలర్ రిలీజ్

"జెట్టి"మూవీ ట్రైలర్ రిలీజ్

ఇకపై కొత్త 'నాని'ని చూస్తారు..!
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగరాయ్. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 24న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈరోజు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని పెంచేశారు. ఇక టీజర్ రిలీజ్ కు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అంతేకాదు నానిని పలు ప్రశ్నలు అడుగగా వాటికి కూడా నాని సమాధానాలు చెప్పారు.

'శ్యామ్ సింగరాయ్' టీజర్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నాలుగు భాషల్లో నాని ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ టీజర్ రిలీజ్ అయింది.

'1997' సినిమా టీజర్ రిలీజ్
డాక్టర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 1997. డాక్టర్ మోహన్ ఈసినిమాకు దర్శకత్వం వహించడమే కాదు నటిస్తున్నారు కూడా. మోహన్ తోపాటు ఈసినిమాలో నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్స్ కు సంబంధించిన పోస్టర్లు, అలాగే ఒక పాట కూడా రిలీజ్ చేయగా అవి అందరినీ బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

"దృశ్యం 2" మూవీ అఫీషియల్ టీజర్ రిలీజ్
శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ “దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం 2″ మూవీ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ”దృశ్యం 2 ” మూవీ లో నదియా , సంపత్ రాజ్ , నరేష్ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

హీరో సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ "జై భీమ్"
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన "జై భీమ్" తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రజిష విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలలో నటించారు. సీన్ రోల్డన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సూర్య 'జై భీమ్' ట్రైలర్ రిలీజ్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సూర్య. గత ఏడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మరోసారి జై భీమ్ లాంటి మరో వాస్తవిక సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జ్ఞానవేల్ రచన, దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1993లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా…

"జెట్టి"మూవీ ట్రైలర్ రిలీజ్
పాండ్రాజు వెంకట రామారావు సమర్పణ లో వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో నందితా శ్వేత, మన్యం కృష్ణ జంటగా మత్స్యకారుల జీవనం నేపథ్యంలో "జెట్టి" మూవీ తెరకెక్కింది. వేణుమాధవ్ నిర్మాత . కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.