
ట్యాగ్ · 7 కథనాలు


'మహానటి' ఖాతాలో మరో అవార్డ్

తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు

'మహర్షి' విషయంలో మహేష్ జోస్యం నిజమైంది
మొత్తానికి మన తెలుగు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ రావడంతో ఇండస్ట్రీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. జాతీయ ఉత్తమ సినిమాగా జెర్సీ సినిమాకు అవార్డ్ దక్కింది. అంతేకాదు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇక వంశీపైడిపల్లి దరశకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సినిమా మహర్షి కూడా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా “మహర్షి” సినిమా అవార్డు సొంతం చేసుకుంది. దీనితో పాటు ఉత్తర కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం(మహర్షి)అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ కెటగిరీలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కు అవార్డ్ దక్కింది. ఈనేపథ్యంలో రెండు సినిమాల చిత్రబృందాలు సంబరాలు జరుపుకుంటున్నారు.

"జెర్సీ "మూవీ కి నేషనల్ అవార్డ్ పై హీరో నాని స్పందన
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధా శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ " మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేషనల్ అవార్డ్స్ లో "జెర్సీ "మూవీ ఉత్తమ చిత్రం గా ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన హీరో నాని ఒక వీడియో ను రిలీజ్ చేశారు.

నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఉత్తమ నిర్మాణ సంస్థ , ""జెర్సీ " మూవీ ఉత్తమ చిత్రం గా జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు నిర్మాణ సంస్థలకూ సినీ ప్రముఖులు అభినందనలు అందజేస్తున్నారు. జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అందరికీ అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.

నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న జెర్సీ, మహర్షి సినిమాలు
కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డ్స్ లో భాగంగా మన తెలుగు సినిమాలు జెర్సీ, మహర్షి సినిమాలు కూడా అవార్డ్స్ ను సొంతం చేసుకున్నాయి.

'మహానటి' ఖాతాలో మరో అవార్డ్
'మహానటి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిలోభాగంగానే జాతీయ అవార్డు కూడా దక్కిన సంగతి తెలిసిందే. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు. అయితే నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మహానటి అవార్డు ను సొంతం చేసుకుంది.

అప్పుడు లేడీ సూపర్ స్టార్, ఇప్పుడు మహానటి - 29 ఏళ్ల తర్వాత
నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డుల్లో మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి.

తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు
నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి. మన తెలుగు సినిమాల్లో మొత్తం నాలుగు సినిమాలకు గాను ఏడు క్యాటగిరీలలో అవార్డులు దక్కాయి.