
ట్యాగ్ · 6 కథనాలు


అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్

ప్రజలకు హెచ్చరిక గా "సింహా " మూవీ డైలాగ్

"#NBK106" మూవీ కి స్పెషల్ సెట్

#NBK106 మూవీ కి కొత్త టైటిల్ ?

స్పీడుమీదున్న 'బాలయ్య'
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు ఒక్క సినిమాలు చేస్తుంటే వీళ్లు మాత్రం ఒక్కోక్కరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.ఈసినిమాత తరువాత గోపిచంద్ మలినేని తో మరొక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు గోపిచంద్ మలినేని. అఖండ అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్
జూన్ 10వ తేదీన నందమూరి బాలయ్య పుట్టిన రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల గత ఏడాది తమ అభిమానులకు పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండమని ఎలా చెబుతున్నారో.. ఈఏడాది కూడా అలాగే తమ అభిమానులను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ కూడా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

ప్రజలకు హెచ్చరిక గా "సింహా " మూవీ డైలాగ్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సింహా " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "సింహా " మూవీ లోని "నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి , కాదని ఏ పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు " డైలాగ్ ను పోలీసులు కొంత మార్చి సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.

"#NBK106" మూవీ కి స్పెషల్ సెట్
మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్ టైనర్ "#NBK106" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "#NBK106" రూపొందుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

#NBK106 మూవీ కి కొత్త టైటిల్ ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ లో అమలా పాల్ ఒక కథానాయిక కాగా మరో కథానాయిక గా ఒక కొత్త నటి పరిచయం కానున్నారు.
నెక్ట్స్ షెడ్యూల్‌కి ముస్తాబవుతున్న బాలయ్య కొత్త చిత్రం
`యన్టీఆర్` బయోపిక్ తరువాత స్వల్ప విరామం తీసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ... ప్రస్తుతం కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్యకి జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక నాయికలుగా నటిస్తుండగా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.