
ట్యాగ్ · 9 కథనాలు


కస్టడీ సెన్సార్ రిపోర్ట్

సమంత హార్డ్ వర్క్, పూజా స్టయిల్ ఇష్టం-నాగచైతన్య

కస్టడీ2 పై వెంకట్ ప్రభు క్లారిటీ

'థాంక్యూ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

"థ్యాంక్యూ"మూవీ లో హాకీ ప్లేయర్ గా నాగచైతన్య

యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై నాగచైతన్య ఫోకస్

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి

కస్టడీ అండర్ వాటర్ సీక్వెన్స్ మేకింగ్
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా మే 12వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

కస్టడీ సెన్సార్ రివ్యూ
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద స్వామి విలన్ పాత్రలో కనిపించనున్నాడు.శరత్ కుమార్,సంపత్ రాజ్,ప్రియమణి కీలకపాత్రలు పోషించారు.ఇళయరాజా,యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈసినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదలకానుంది.

కస్టడీ సెన్సార్ రిపోర్ట్
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమాలో హీరో విలన్ ను చంపుతాడు కానీ ఈసినిమాలో హీరో విలన్ చావకుండా, అతడిని కాపాడాలని హీరో అనుకోవడమే సినిమా థీమ్. డిఫరెంట్ థీమ్ వస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి విలన్ ను హీరో ఎందుకు కాపాడుతున్నాడు? కాపాడటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

సమంత హార్డ్ వర్క్, పూజా స్టయిల్ ఇష్టం-నాగచైతన్య
అప్పట్లో టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో నాగ చైతన్య-సమంత జోడీ కూడా ఉండేది. కానీ ఆతరువాత వీరిద్దరూ విడిపోవడం.. డివోర్స్ తీసుకోవడం.. వారి కెరీర్ లో బిజీ అయిపోవడం జరిగిపోయింది. అయితే ఎందుకు విడిపోయారన్న విషయంపై ఇప్పటికీ పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు కానీ.. సమయం వచ్చినప్పుడల్లా ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత గురంచి మాట్లాడుతూ చై పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు.

కస్టడీ2 పై వెంకట్ ప్రభు క్లారిటీ
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నుండి ఈ ఏడాది వస్తున్న మొదటి సినిమా కస్టడీ. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా ఈసినిమా రానుంది. ఈసినిమాలో చైతు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ వీలైనంత ప్రమోషన్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేశాయి.

'థాంక్యూ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
ఈఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య. ఈ ఏడాదే మరో సినిమాకు కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా నుండి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు చాలా రోజుల నుండి. దీంతో ఫ్యాన్స్ కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా వారికి స్వీట్ సర్ ప్రైజే ఇచ్చారు మేకర్స్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న…

"థ్యాంక్యూ"మూవీ లో హాకీ ప్లేయర్ గా నాగచైతన్య
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటించారు.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై నాగచైతన్య ఫోకస్
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోలలో నాగచైతన్య కుటుంబ కథా చిత్ర హీరోగా మారారు. కెరీర్ ఆరంభం లో నాగచైతన్య కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ లో నటించినా, ఆ తరువాత యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై ఫోకస్ పెట్టారు.

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి
2021 సంవత్సరం లో హీరో నాగచైతన్య మూడు సినిమాలతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "థ్యాంక్ యు " మూవీ లో నటిస్తున్నారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా ఇటలీ లో జరిగిన విషయం తెలిసిందే.