
ట్యాగ్ · 6 కథనాలు


భారీ యాక్షన్ షెడ్యూల్ లో మెగా 154

అయ్యప్ప సన్నిధి లో చిరంజీవి

ఉగాది పండగ కి "ఆచార్య "

వాల్తేరు వీరయ్య మూవీ బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

చరణ్ కు చిరు ఛాలెంజ్.. మరో పాట అప్ డేట్..!
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో ఈసినిమా నుండి వరుసగా అప్డే ట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో అప్ డేట్ తో ముందుకొచ్చేశారు. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ఒక చిన్న వీడియోను…

భారీ యాక్షన్ షెడ్యూల్ లో మెగా 154
సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చిరంజీవి ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలతోపాటు చిరు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా షూటింగ్ ను ప్రారంభించింది. మెగా 154 టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథి గా చిరంజీవి
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్29 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అయ్యప్ప సన్నిధి లో చిరంజీవి
మెగా స్టార్ చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షను తీసుకుంటున్న విషయం తెలిసిందే. శబరిమల లో మండల పూజ, మకరజ్యోతి సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఆ సమయంలో కుదరకపోవడంతోనే ఇప్పుడు చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు వెళ్లారు. మాస పూజ సందర్భంగా ఈ నెల 12 వ తేదీ నుండి 17 తేదీ వరకూ అయ్యప్ప స్వామి దేవాలయం తెరచి ఉంచుతారు. కాగా డోలీలో శబరికొండకు చేర్చిన డోలీ కార్మికులకు మెగాస్టార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు.

ఉగాది పండగ కి "ఆచార్య "
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన లాహే లాహే , నీలాంబరి, శానా కష్టం సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో…