కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mega Powerstar Ram Charan

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

రాజమౌళి పై 'RRR' టీమ్ ఫిర్యాదులు

ఒక్కో సినిమాను రాజమౌళి ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతాడో అందరికీ తెలుసు. ఒక శిల్పాన్ని ఎంతో జాగ్రత్తగా ఎలా చెక్కుతారో అలా చెక్కుతాడు కాబట్టే ఆయనకు జక్కన్న అన్న పేరు పెట్టారు. అలా ఉంటాడు కాబట్టే మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి కారణమయ్యాడు. దేశం గర్వించదగ్గ దర్శకుడు అయ్యాడు. ఇక ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు సినీ ప్రముఖుల నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విచిత్రం ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. సీరియస్ గా ఏం కాదులెండి కామెడీగా. సెట్స్ లో రాజ‌మౌళి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ టీం స‌భ్యులు ఆయ‌న సెట్‌లో ఎలా ఉంటార‌నే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జక్కన్నకు 'RRR' టీమ్ బర్త్ డే విషెస్

`బాహుబలి`సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకదిగ్గజం రాజమౌళి. ఇక ఈరోజు రాజమౌళి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్న న‌టీన‌టులు కూడా జక్కన్నకు సోషల్ మీడియా ద్వారా స్పెష‌ల్ విషెస్ అందించారు.

TFN Adminవాట్సాప్
Throwback Thursday: Megastar Chiranjeevi and Ram Charan Make One Of The Best On Screen Pairs Of Tollywood
సినిమా వార్తలు

అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్

సినీ చరిత్రలో మెగా ఫ్యామిలీకి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం ఎవరో కూడా అందరికీ తెలుసు. తెలుగు సినిమాకే కాదు.. మెగా ఫ్యామిలీకి కూడా ఒక మూలస్తంభం అయిన మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరుకి తనయుడు మెగా పవర్ స్టార్ కు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత దేశానికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత స్టార్, సూపర్ స్టార్ లైనా పిల్లలకు సాధారణ మనుషులే. మరి ఇక మెగా పవర్ స్టార్ రేంజ్ కు ఎదిగినా కూడా చిరు మాత్రం ఎప్పటికీ తనకు ముద్దుల కొడుకే. పలు సందర్భాల్లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మనకు తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని పిక్స్ ను చూద్దాం..

TFN Adminవాట్సాప్
Ram Charan Shares His Experience Of Being A Producer To Syeraa As Movie Turns One Year Today
సినిమా వార్తలు

ఏడాది పూర్తి చేసుకున్న సైరా - బెస్ట్ ఎక్స్పీరియన్స్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది 2019 అక్టోబర్ 2 న రిలీజ్ అయి నేటితో ఒక ఏడాది పూర్తి చేసుకుంది. చిరంజీవితో పాటు అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుధీప్, విజయ సేతుపతి లాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ చిరు తో స్క్రీన్ ను షేర్ చేసుకోగా.. విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా ఫేవరెట్ హీరోయిన్ తనే..!

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాలో సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. దానితో ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ సాయి పల్లవి సంగతి గురించి తెలిసిందే కదా. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకోదని.. పాత్ర ప్రధానమైన సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ఒక్క సినిమాతో ఈ అమ్మడు యూత్ లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక మరోహీరో కూడా తన ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి అని చెబుతున్నాడు. ఆ హీరో ఏవరో కాదు…

TFN Adminవాట్సాప్
గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ తో రామ్ చరణ్..?
సినిమా వార్తలు

గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ తో రామ్ చరణ్..?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత అటు ఎన్టీఆర్ కానీ ఇటు రామ్ చరణ్ కానీ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారా అని గతకొద్ది కాలంగా తెగ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో అని ఇటీవలే ప్రకటించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఎవరితో ఉండబోతుందో అన్న చర్చలు నడుస్తున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్