
ట్యాగ్ · 6 కథనాలు


లూసిఫర్ రీమేక్ రూమర్స్ కు చెక్ పెట్టిన చిరు

'లూసిఫర్' రీమేక్ కోసం చిరు డేట్సు
చిరు 'లూసిఫర్' రీమేక్ ప్రారంభం
'లూసిఫర్' మ్యూజికల్ జర్నీ స్టార్ట్
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?

'లూసిఫర్' కోసం భారీ సెట్స్
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ చివరిదశలో ఉండగా.. ఈసినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ ను లైన్ లో పెట్టనున్నాడు. ప్రస్తుతం లూసిఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా వీలైనంత తొందరగా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమాకు కూడా భారీ సెట్స్ ను వేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఇప్పటికే చిరు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న “ఆచార్య” కోసం భారీ ఆలయాన్ని సృష్టించిన ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ ఈ “లూసిఫెర్” రీమేక్ కోసం కూడా పని చేస్తున్నారు.

లూసిఫర్ రీమేక్ రూమర్స్ కు చెక్ పెట్టిన చిరు
మెగాస్టార్ చిరు లిస్ట్ లో ఇప్పుడు పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎలాగూ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయిపోయి ఉండేది. గత ఏడాది.. ఈఏడాది కరోనా వల్ల ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. కనీసం కరోనా సెకండ్ వేవ్ లేకపోతే షూటింగ్ అయినా పూర్తి చేసుకొని ఉండేది. కానీ ఇంకా పది ఇరవై రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది.

'లూసిఫర్' రీమేక్ కోసం చిరు డేట్సు
మెగాస్టార్ చిరు లిస్ట్ లో ఇప్పుడు పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆయన లైన్ లో పెట్టిన సినిమాలను కూడా ఎలాగైనా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎలాగూ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే ఈసినిమా షూటింగ్ అయిపోయి ఉండేది. ఇక కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే తుది దశలో ఉన్న ఆచార్య షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.
చిరు 'లూసిఫర్' రీమేక్ ప్రారంభం
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఎంతోమంది డైరెక్టర్స్ పేర్లు వినిపించినా ఫైనల్ గా రీమేక్స్ స్పెషలిస్ట్ అయిన తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రానికి డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు. పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో మోహన్ రాజా అయితే సరిగ్గా రీమేక్ చేయగలడని మోహన్ రాజాను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
'లూసిఫర్' మ్యూజికల్ జర్నీ స్టార్ట్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే చెప్పే పేరు థమన్. ప్రస్తుతం థమన్ క్రేజ్ మాములుగా లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ దాదాపు థమన్ ఖాతాలనో ఉన్నాయి. అసలే ఫుల్ డిమాండ్ లో ఉన్న థమన్ ను అల వైకుంఠపురములో ఆల్బమ్ థమన్ స్థాయిని మరింత పెంచింది. అందరు దర్శక నిర్మాతలు థమన్ వైపే చూసేలా చేసింది ఆ సినిమా. ఇక ప్రస్తుతం ఎలా లేదనుకున్న థమన్ ఓ అరడజను సినిమాలకు పైనే పని చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసాడు.
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?
సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.