మూడు డిఫరెంట్ పాత్రల్లో సుధీర్ బాబు

Sudheer Babu to Play Three Different Roles in his Next,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Sudheer Babu,Sudheer Babu Latest News,Sudheer Babu New Movie News,Sudheer Babu Next Project News,Sudheer Babu Latest Film Details,Sudheer Babu Upcoming Movie News,Sudheer Babu to Play Three Different Roles in his Upcoming Movie

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రయోగాలు చేయడానికి కొంతమంది మాత్రమే ముందుకు వస్తుంటారు. అలా ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం తను నుండి రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా హంట్. మహేష్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకాంత్, భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనితో పాటు సుధీర్ బాబు మామా మశ్చీంద్ర అనే సినిమా కూడా చేస్తున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలోనే ఉంది. తాజాగా ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు సుధీర్ బాబు. ప్రస్తుతం సుధీర్ బాబు హంట్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈనేపథ్యంలో మామ మశ్చీంద్ర సినిమా గురించి మాట్లాడుతూ.. ఈసినిమాలో తను మూడు డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఒక పాత్రలో దాదాపు 150 కేజీల భారీ కాయంతో కూడా కనిపించబోతున్నట్టు తెలిపాడు. మరి చూద్దాం ఈసినమాలో ఎంత వైవిద్యంగా కనిపించబోతున్నాడో..

కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.