
ట్యాగ్ · 6 కథనాలు


సత్యదేవ్ ఫుల్ బాటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నరేష్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్ డేట్

'పక్కా కమర్షియల్'.. రాశీఖన్నా బర్త్ డే టీజర్ రిలీజ్

'వరుడు కావలెను' టీజర్ రిలీజ్

'డియర్ మేఘ' టీజర్ రిలీజ్

రంగబలి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే హిట్స్ ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేయడానికే ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం అయితే నాగశౌర్య మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగబలి. పల్లెటూరి నేపథ్యంలో ఈసినిమా ఉండబోతుందని ఈసినిమా గ్లింప్స్ ను బట్టి అర్థమయింది.

సత్యదేవ్ ఫుల్ బాటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించే నటుల్లో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. ఒక పక్క హీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నాడు. ఈనేపథ్యంలో ఫుల్ బాటిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

నరేష్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్ డేట్
ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈసినిమాను విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా విడుదలకు సిద్ధమవుతుండగా చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటివరకూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

'పక్కా కమర్షియల్'.. రాశీఖన్నా బర్త్ డే టీజర్ రిలీజ్
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం రాశీ ఖన్నా యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశీ ఖన్నా. ఇప్పుడు ఈసినిమాలో మరోసారి కలిసి చేస్తున్నారు.

'వరుడు కావలెను' టీజర్ రిలీజ్
థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలు తమ సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేసుకోడానికి ట్రై చేస్తున్నారు. అందుకే పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్ లను చకచకా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇక నాగశౌర్య కూడా అదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వాటిలో వరుడు కావలెను సినిమా కూడా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసింది. ఇక ఈగ్యాప్ లో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో…

'డియర్ మేఘ' టీజర్ రిలీజ్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.