
ట్యాగ్ · 6 కథనాలు


ప్రభాస్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు

రారాజు కృష్ణంరాజు

రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

'రాధేశ్యామ్'.. పరమహంసగా రెబల్ స్టార్

లారెన్స్ ఎమోషనల్-కడసారి చూడలేకపోయా
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రెబల్ స్టార్ మొన్న తుది శ్వాస విడిచారు. ఇక కృష్ణంరాజు మరణంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, సన్నిహితులు అందరూ విచారంలోనే ఉన్నారు. ఇక నిన్న కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. ఇక కృష్ణంరాజును చివరిసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ప్రభాస్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొన్న తుది శ్వాస విడిచారు. ఇక ఆయన అంత్యక్రియలు నిన్న జరిపారు. జూబ్లీహిల్స్ నుండి కనకమామిడి ఫాంహౌస్ వరకు కొనసాగిన అంతిమయాత్రలో ఎంతోమంది జనం పాల్గొన్నారు. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఇక మరోవైపు అందరూ కృష్ణంరాజు గురించి తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

రారాజు కృష్ణంరాజు
చిలకా గోరింకా (1966) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృష్ణంరాజు హీరో, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ , కృష్ణ , శోభన్ బాబు , మోహన్ బాబు , చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , జగపతి బాబు , ప్రభాస్ , శ్రీకాంత్ , నాని లతోపలు సినిమాలలో కృష్ణం రాజు నటించారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ స్థాపించి కృష్ణంరాజు వాణిశ్రీ కథానాయికగా కృష్ణవేణి మూవీ ని నిర్మించారు. ఆ మూవీ ఘనవిజయం సాధించి కృష్ణంరాజు కెరీర్ ను మలుపు తిప్పింది. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై బాపు దర్శకత్వంలో కృష్ణం రాజు , వాణిశ్రీ జంటగా తెరకెక్కిన భక్త కన్నప్ప బ్లాక్…

రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
ఈరెండేళ్లలో ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయింది తెలుగు సినీ పరిశ్రమ. ఎంతో మంది లెజెండరీ నటీనటులు, గాయకులు, రచయితలు ఇలా ఎంతోమందిని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఇక తాజాగా మరో సీనియర్ లెజెండరీ హీరోను ఇండస్రీ కోల్పోయింది. ఆ నటుడు ఎవరో కాదు రెబల్ స్టార్ కృష్ణం రాజు. పాత తరం నాయకుల్లో ఇండస్ట్రీకి అండగా పెద్దగా ఉన్న హీరో కృష్ణంరాజు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో నేడు తెల్లవారుజామున మృతి చెందారు. కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇక కృష్ణంరాజు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

'రెబల్ స్టార్' కి రాధేశ్యామ్ టీమ్ బర్త్ డే విషెస్..!
ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనుండగా.. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

'రాధేశ్యామ్'.. పరమహంసగా రెబల్ స్టార్
ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. ఈసినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు భారీగానే ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతుండగా.. అదే రోజు ఫ్యాన్స్ తో ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు.