
ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2


'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు

'సమ్మతమే' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం

'SR కళ్యాణమండపం' రిలీజ్ డేట్ ఫిక్స్

'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఇప్పటికి కిరణ్ సినిమాలు రిలీజ్ అయింది రెండు సినిమాలు మాత్రమే కానీ వరుస అవకాశాలు.. పెద్ద పెద్ద బ్యానర్స్ లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక కిరణ్ లిస్ట్ లోచాలా సినిమాలు ఉండగా అందులో సెబాస్టియన్ పీసీ 524 సినిమా కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని అవకాశాలు దక్కించుకోవడం మరో ఎత్తు. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొంత లక్ అనేది మాత్రం ఉండాలి. ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లో అలాంటి అదృష్టం ఉన్న హీరో కిరణ్ అబ్బవరం అని చెప్పొచ్చు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు…

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'
టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇక దీనికి అనుసంధానంగా రీసెంట్ గా గీతా ఆర్స్ట్ 2 కూడా వచ్చింది. ఈ బ్యానర్ నుండి ఇప్పటివరకూ అరడజను వరకూ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా దాదాపు అన్నీ సక్సెస్సే అయ్యాయి. అంతేకాదు ఈ బ్యానర్ లో యంగ్ హీరోలకు.. కొత్త టాలెంట్ కు ఛాన్స్ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ చాలా తక్కువ టైమ్ లోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా
రాజా వారు-రాణీగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. టాప్ ప్రొడక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాబీ, గోపీచంద్ మలినేనిల వద్ద ఎన్నో సినిమాలకు పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈసినిమాను ఎంతో మంది అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సైలెంట్ గా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ మరో సినిమాను ప్రారంభించాడు. కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది.

'సమ్మతమే' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. రాజావారు రాణి గారు” ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో సమ్మతమే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం
చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా స్టార్ చిరంజీవి , విజయ్ దేవరకొండ , నిఖిల్ , విశ్వక్ సేన్ వంటి వారు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అనే యువనటుడు ఆకోవకు చెందుతారు. "రాజాగారు రాణివారు " వంటి చిన్న సినిమాతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన కిరణ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు.

కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పటికే SR కళ్యాణమండపం సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కిరణ్ చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై దాదాపు చివరి దశకు వచ్చేసింది.

'SR కళ్యాణమండపం' రిలీజ్ డేట్ ఫిక్స్
నూతన దర్శకుడు శ్రీధర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా వస్తున్న సినిమా SR కళ్యాణమండపం EST 1975. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈఏడాది మేలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు SR కళ్యాణమండపం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల…