
ట్యాగ్ · 7 కథనాలు


'1000 కోట్ల' క్లబ్ లో కె.జి.యఫ్ 2..!

'కె.జి.యఫ్ 2' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

'కె.జి.యఫ్ 2' డబ్బింగ్ పూర్తిచేసిన రవీనా..!

'కె.జి.యఫ్2' డబ్బింగ్ పూర్తి చేసుకున్న అధీరా

'కె.జి.యఫ్' ను మించి 'సలార్'

1250 కోట్ల దిశగా "కె జి ఎఫ్ చాప్టర్ 2 "
స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగాహోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో అన్ని భాషలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

'1000 కోట్ల' క్లబ్ లో కె.జి.యఫ్ 2..!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు అందులోనూ సౌత్ ఇండియా సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. పుష్ప తో మొదలైన ఈ ప్రభంజనం రీసెంట్ గా రిలీజ్ అయిన కె.జి.యఫ్ 2 వరకూ కొనసాగుతూనే ఉంది. పుష్ప సినిమాతో మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి సినిమాతో తన సత్తా చూపించాడు. ఇక బాహుబలి తో ఇప్పటికే రాజమౌళి తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్రంపంచానికి తెలియచేశాడు. మరి అలాంటి రాజమౌళి నుండి వచ్చిన సినిమా కాబట్టి సక్సెస్ కొట్టడంలో ఆశ్చర్యం ఏంలేదు.

'కె.జి.యఫ్ 2'.. 'తూఫాన్ లిరికల్ సాంగ్ రిలీజ్
సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. కె.జి.యఫ్ పార్ట్ 1 కు సీక్వెల్ గా ఈసినిమా వస్తుండగా.. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మైనింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈసినిమాకు సౌత్ నుండి నార్త్ వరకూ అందరూ బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమా ఎప్పుడో అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉన్నా కరోనా వల్ల చాలా సార్లు వాయిదా పడింది. ఇక ఈసినిమా ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'కె.జి.యఫ్ 2' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్లు మార్చుకున్న నేపథ్యంలో ఈసినిమా రిలీజ్ డేట్ కూడా మారుతుందిలే అనుకున్నారు కానీ.. ఇప్పటివరకూ మాత్రం అదే రిలీజ్ డేట్ ను ఉంచారు. మరి రిలీజ్ లోపు ఇదే డేట్ ఉంటుందా లేక వేరే డేట్ మారుతుందా అన్న అనుమానాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇక మరోవైపు ప్రమోషన్స్ విషయంలో మాత్రం మేకర్స్ కాస్త స్లోగానే ఉన్నారని చెప్పొచ్చు. ఈసినిమా నుండి ఇప్పటి వరకూ పలు పోస్టర్లు వచ్చాయి. టీజర్ కూడా ఎప్పుడో…

'కె.జి.యఫ్ 2' డబ్బింగ్ పూర్తిచేసిన రవీనా..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’కు ఇది సీక్వెల్. ఇక పార్ట్1 సంచలనాలు క్రియేట్ చేయడంతో ఈ సీక్వెల్ పై అదే స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకున్నా కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14నే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'కె.జి.యఫ్2' డబ్బింగ్ పూర్తి చేసుకున్న అధీరా
వచ్చే ఏడాది వచ్చే పెద్ద సినిమాల్లో కె.జి.యఫ్2 కూడా ఒకటి. ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్ లో వచ్చిన పార్ట్ 1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. ఇప్పుడు పార్ట్ 2 వస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీనిలోభాగంగానే ఒక్కొక్కరూ తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇక తాజాాగా ఈసినిమాలో అధీరా అనే కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేశాడు. ఈవిషయాన్ని సంజయ్ దత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ‘‘అధీర యాక్షన్ లోకి వచ్చేశాడు. కె.జి.యఫ్…

'కె.జి.యఫ్' ను మించి 'సలార్'
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం కదా. ఏమాత్రం అంచనాలు అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈసినిమా కన్నడ సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ లో కూడా కలెక్షన్ల పరంగా ఈసినిమా తన సత్తా చాటింది. ఇక ఇప్పుడు దీని సీక్వెల్ కె.జి.యఫ్ 2 కూడా వస్తుంది. ఈసినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.