
ట్యాగ్ · 6 కథనాలు


'ఏక్ మినీ కథ' యూనిక్ అండ్ జెన్యూన్

"ఏక్ మినీ కథ "మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్

'ఏక్ మినీ కథ' ట్రైలర్ రిలీజ్
'ఏక్ మినీ కథ' టీజర్ రిలీజ్

'ఏక్ మినీ కథ' పై శర్వానంద్ ప్రశంసలు
కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా.. కావ్య థాపర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఏక్ మినీ కథ. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈసినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించింది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమా టీజర్, ట్రైలర్ లతోనే ఈసినిమా అంచనాలు పెంచేసింది. ఇక బ్రహ్మాజీ, హర్షవర్ధన్, సుదర్శన్, పోసాని, శ్రద్ధాదాస్, సప్తగిరి తదితరులు నటించిన ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో నేడు రిలీజ్ అవ్వగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

'ఏక్ మినీ కథ' రివ్యూ
ఇక ఫైనల్ గా చెప్పాలంటే.. ఫ్యామిలీ అందరితో కలిసి చూసే సినిమా కాకపోయినప్పటికీ కామెడీ చిత్రాలను ఆదరించే వారికి, విభిన్నమైన కథల కోసం ఎదురు చూసే వారికి ఏక్ మినీ కథ తప్పకుండా నచ్చుతుంది.

'ఏక్ మినీ కథ' యూనిక్ అండ్ జెన్యూన్
ఈమధ్య చిన్న సినిమాలకు, చిన్న హీరోలకు పెద్ద హీరోలు తమ సపోర్ట్ బాగానే ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సపోర్ట్ ను అందిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఏక్ మినీ కథకు కూడా మన స్టార్ హీరోల నుండి సపోర్ట్ అందుతూనే ఉంది. ముఖ్యంగా ప్రభాస్ మాత్రం ఈసినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. అందులోనూ ఏక్ మినీ కథలో నటించిన సంతోష్ తనకు వర్షం లాంటి సూపర్ హిట్ అందించిన శోభన్ కొడుకు కావడంతో ప్రభాస్ ఇంకాస్త ఎక్కువగానే సపోర్ట్ అందిస్తున్నాడు.

"ఏక్ మినీ కథ "మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్
యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై కార్తీక్ రాపోలు దర్శకత్వంలో దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ , కావ్య థాపర్ జంటగా రూపొందిన "ఏక్ మినీ కథ "మూవీ మే 27 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నూతన దర్శకుడు కార్తీక్ ఒక వినూత్న కాన్సెప్ట్ తో ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా "ఏక్ మినీ కథ "మూవీ ని తెరకెక్కించారు.

'ఏక్ మినీ కథ' ట్రైలర్ రిలీజ్
‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెరకి పరిచయమై ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రేక్షకుల చేత నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో.. ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతూ ఏక్ మినీ కథ అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం ఫుల్ కామెడీగా ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
'ఏక్ మినీ కథ' టీజర్ రిలీజ్
అతి తక్కువ కాలంలోనే యూవీ క్రియేషన్స్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థగా ఎదిగింది. అంతేకాదు ఒకపక్క పెద్ద సినిమాలు చేస్తూనే మరోపక్క కొత్త దర్శకులను పరిచయం చేస్తూ.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను కూడా నిర్మిండానికి కూడా రెడీ అవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి అందులో కూడా సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ తో మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఇప్పుడు ఏక్ మినీ కథ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.