
ట్యాగ్ · 6 కథనాలు


కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్

ఇండియన్ 2 షూట్ లో జాయిన్ అయిన కమల్

ఇండియన్ 2-10 మినిట్స్ డైలాగ్14 భాషల్లో

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే

ఇండియన్ 2- బ్రేక్ లేకుండా 30 రోజులు
లెజెండరీ డైరెక్టర్ శంకర్ మాత్రం ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. తన చేతిలో ప్రస్తుతం ఇండియన్ 2 ఇంకా రామ్ చరణ్ సినిమాలు ఉన్నాయి. ఇక వీటిని పార్లల్ గా షూట్ చేస్తూ బ్రేక్ లేకుండా వర్క్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. ఈసినిమాకు మధ్యలో పలు వివాదాలు తలెత్తినా అనంతరం పలు చర్చలు జరిపి తిరిగి సెట్స్ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా…

కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇండియన్ 2 షూట్ లో జాయిన్ అయిన కమల్
ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్. చాలా గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే కమల్ ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యి పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. మధ్యలో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లైకాతో కూడా వివాదలు తలెత్తాయి. అయితే పలు చర్చల అనంతరం ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇండియన్ 2-10 మినిట్స్ డైలాగ్14 భాషల్లో
మొత్తానికి అసలు ఈసినిమా ఉంటుందా?మళ్లీ సెట్స్ పైకి వెళ్లడం కష్టం అనుకుంటున్న నేపథ్యంలో తిరిగి షూటింగ్ ను ప్రారంభించుకుంది విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక మధ్యలో క్రేన్ యాక్సిడెంట్ అవ్వడం దానివల్ల షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. దాని తరువాత నిర్మాణసంస్థతో వివాదలు..దీంతో ఈసినిమా రావడం కష్టమనే అనుకున్నారు అందరూ. శంకర్ డైరెక్టర్, కమల్ హీరో, లైకా లాంటి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. వేరే…

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి.

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే
లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఆతరువాత కమల్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ,షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు.