
ట్యాగ్ · 6 కథనాలు


లేడీ ఓరియెంటెడ్ మూవీ లో ప్రియమణి

ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది..!

'విరాట పర్వం' టీజర్ రిలీజ్
"విరాటపర్వం "ఉమెన్స్ డే స్పెషల్ వీడియో రిలీజ్
బిజీగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి

'ఫ్యామిలీ మ్యాన్ 3' లో చేస్తున్నా
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈసిరీస్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వగా... ఇటీవల రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అంతకంటే ఎక్కువ సక్సెస్ అయింది. ఇక ఈసిరీస్ లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అంతేకాదు దానికి ఫలితంగా ఇటీవల తనకు అవార్డ్ కూడా దక్కింది.

లేడీ ఓరియెంటెడ్ మూవీ లో ప్రియమణి
"ఎవరే అతగాడు "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి "కంగలై ఖైదు సేయ్ "మూవీ తో కోలీవుడ్ , "సత్యం "మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. "పరుత్తి వీరన్ "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది..!
ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. 'పెళ్ళైనకొత్తలో సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది ప్రియమణికి. ఇక ఆ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన పదిహేనేళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో ఎంతో మంది హీరోలతో నటించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పలు పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

'విరాట పర్వం' టీజర్ రిలీజ్
యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. నీదీ నాదీ ఒకే కథ అనే చిత్రంతో అందరి ప్రశంసలు దక్కించుకున్న వేణు ఉడుగుల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వదిలిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఇటీవలే రిలీజ్ చేసిన కోలు కోలు సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.
"విరాటపర్వం "ఉమెన్స్ డే స్పెషల్ వీడియో రిలీజ్
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ" మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలోరానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన "విరాటపర్వం "మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన "విరాటపర్వం "మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు.
బిజీగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి
“ఎవరే అతగాడు” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “పరుత్తి వీరన్ “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పలు భాషల మూవీస్ తో ప్రియమణి బిజీగా ఉన్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి ప్రస్తుతం 4తెలుగు , 3 కన్నడ , ఒక హిందీ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు.