
ట్యాగ్ · 7 కథనాలు


ఆర్ఆర్ఆర్ - అలియా వల్ల రీ షెడ్యూల్
అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు
"RRR" మూవీ షూటింగ్ లో అలియాభట్ ఎంట్రీ

నవంబర్ లో "RRR" షూటింగ్ లో అలియాభట్
'ఆర్ఆర్ఆర్' షూట్ కోసం వెయిటింగ్
అలియాపై క్లారిటీ తో రాజమౌళి

'వకీల్ సాబ్' తో అలియా 'గంగూబాయి కతియావాడి' తెలుగు టీజర్
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా గంగూబాయి కతియావాడీ. ఇక ఈ సినిమా హిందీ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో అలియా నటనకు అందరూ ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడు ఈసినిమా తెలుగు టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రేపు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ పాబ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటుగా గంగూబాయి కతియావాడీ తెలుగు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఆర్ఆర్ఆర్ - అలియా వల్ల రీ షెడ్యూల్
రాజమౌళి ఎంత తొందరగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అలియాకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ లో మళ్లీ కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు అలియా పేర్కొంది. వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నానని తెలిపింది.
అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా గంగూబాయికతియావాడీ. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా అందులో అలియా నటన చూసినవారందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
"RRR" మూవీ షూటింగ్ లో అలియాభట్ ఎంట్రీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో లుగా మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

నవంబర్ లో "RRR" షూటింగ్ లో అలియాభట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్ తో "రౌద్రం రణం రుధిరం " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' షూట్ కోసం వెయిటింగ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా ఇన్నిరోజులకు హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను ప్రారంభించారు.
అలియాపై క్లారిటీ తో రాజమౌళి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపోటిజమ్ పై ఎన్ని చర్చలు జరిగాయో.. జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ నెపోటిజమ్ అనే కాన్సెప్ట్ వల్ల కొంతమంది బాలీవుడ్ వారసులు కూడా టార్గెట్ అయ్యారన్న సంగతి కూడా తెలుసు. అందులో ముఖ్యంగా అలియా బట్ కూడా ఒకరు. సడక్ 2 కు వచ్చిన డిస్ లైక్స్ ను చూస్తేనే చెప్పొచ్చు పాపం అలియా పై ఎంత ట్రోలింగ్ జరిగిందో. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కూడా అలియా తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాజమౌళి అలియా ప్లేస్ లో ఇంకే హీరోయిన్ ను రీప్లేస్ చేయనని చెపుతున్నాడు.