
ట్యాగ్ · 6 కథనాలు


మహిళలకు మహేష్ బాబు ఉమెన్స్ డే స్పెషల్ విషెస్
కీర్తి సురేష్ ఉమెన్స్ డే మెసేజ్

కూతురికి చిరు మెగా గిఫ్ట్
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఉమెన్స్ డే స్పెషల్ పోస్టర్
సూపర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క బాహుబలి, వేదం, రుద్రమ దేవి, భాగమతి వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిశ్శబ్దం మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఉమెన్స్ డే స్పెషల్ శాకుంతలం మూవీ లేటెస్ట్ పోస్టర్
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. యశోద లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహిళలకు మహేష్ బాబు ఉమెన్స్ డే స్పెషల్ విషెస్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ప్రతీ విషయానికి స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.

'కె.జి.యఫ్2'.. ఉమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్..!
కన్నడ రాక్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కె.జి.యఫ్ 2. కె.జి.యఫ్ పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో కె.జి.యఫ్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల ఏప్రిల్ 14న ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా.. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ మళ్లీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు ఈసినిమా…
కీర్తి సురేష్ ఉమెన్స్ డే మెసేజ్
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి , మలయాళ తమిళ భాషల మూవీస్ లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ "నేను శైలజ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "రంగ్ దే!"మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన కీర్తి ప్రస్తుతం "సర్కారు వారి పాట "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కీర్తి ప్రస్తుతం 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.