
ట్యాగ్ · 6 కథనాలు


ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో VD12

VD13 త్వరలో షూటింగ్ మొదలు

లైగర్ క్రేజీ అప్ డేట్...!
'హ్యాపీ బర్త్ డే' మై కామ్రేడ్..!

"హ్యాపీ బర్త్ డే "

మైతీ బ్యానర్ లో విజయ్ మూవీ అనౌన్స్ మెంట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు సినిమా హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన క్రేజ్ ఉంటుంది. ఈమధ్య విజయ్ కు సాలిడ్ హిట్ పడింది లేదు. వరుస ఫ్లాప్స్ మధ్య గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఈఏడాది ఫ్యామిలీ స్టార్ తో వచ్చాడు కానీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయినా కూడా విజయ్ దేవరకొండకు అవకాశాలకు మాత్రం కొదువలేదు. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో VD12
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టడమే కాదు.. డీసెంట్ హీరో అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా రౌడీ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో తెలుగులో మరో ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. అప్పటినుండి వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి.

VD13 త్వరలో షూటింగ్ మొదలు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస పరాజయాలు అందుకుంటున్నా తనకున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. వరుస అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్న ఈసినిమాను ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

లైగర్ క్రేజీ అప్ డేట్...!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అలానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా పరిచయం అవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండటం.. అలానే క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
'హ్యాపీ బర్త్ డే' మై కామ్రేడ్..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు వచ్చాయి. వీటిలో 'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొత్తగా... 'డియర్ కామ్రేడ్' మాత్రం అంత విజయం దక్కించుకోలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి పై పలు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పింది రష్మిక. తన ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే మై డియర్ కామ్రేడ్ అంటూ పేర్కొంది.

"హ్యాపీ బర్త్ డే "
"నువ్విలా ", లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ " వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ "ఎవడే సుబ్రమణ్యం " మూవీ తో గుర్తింపుపొందారు. సూపర్ హిట్ "పెళ్ళి చూపులు "మూవీతో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి "మూవీ తో ప్రేక్షక, అభిమానులలో సెన్సేషనల్ హీరోగా విజయ్ క్రేజ్ పెంపొందించుకున్నారు. ఆ మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. విజయ్ హీరోగా నటించిన "గీత గోవిందం "మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది.