
ట్యాగ్ · 6 కథనాలు


మహేష్ బాబు ను పరామర్శించిన రామ్ చరణ్

సూపర్ స్టార్ ను పరామర్శించిన మెగాస్టార్

మహేష్ కుటుంబానికి టాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం

వాయిదా పడిన హంట్ టీజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కు మాతృ వియోగం

నమ్రత శిరోద్కర్ హార్ట్ ఫుల్ మెసేజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఒకపక్క ఇంట్లో వ్యవహారాలు చూస్తూనే మరోపక్క మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇక సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పలు పోస్ట్ లను షేర్ చేసుకుంటూనే ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నమ్రత ఎప్పటికప్పుడూ తన ఇన్ట్సాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు.

మహేష్ బాబు ను పరామర్శించిన రామ్ చరణ్
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా మహేష్ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. సినీ సెలెబ్రిటీలు హాజరై ఇందిరా దేవి గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

సూపర్ స్టార్ ను పరామర్శించిన మెగాస్టార్
మహేష్ బాబు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితమే మహేష్ అన్నయ్య రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆ బాధనుండి కోలుకోకముందే అప్పుడే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి గారు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె మృతిపై స్పందిస్తూ అభిమానులు, సినీ సెలబ్రిటీస్ అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో మహేష్ కుటుంబసభ్యులతోపాటు.. పలువురు సినీ…

మహేష్ కుటుంబానికి టాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం
టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది. రీసెంట్ గానే సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందారు. ఇంకా ఆ సంఘటన నుండి టాలీవుడ్ కోలుకోక ముందే అప్పుడే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి నేడు తుది శ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక నేడు పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. దీంతో మహేష్ కుటుంబంలో విషాదం అలుముకుంది. రీసెంట్గా ఘట్టమనేని కుటుంబంలో రమేష్ బాబు చనిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి కూడా చనిపోవటం ఎంతో బాధాకరం. ఇక ఇందిరా దేవి మరణంతో…

వాయిదా పడిన హంట్ టీజర్
మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సుధీర్ బాబు 16వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు హంట్.. (గన్స్ డోంట్ లై) అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాలో సుధీర్ తో పాటు శ్రీకాంత్, తమిళ హీరో భరత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ ముగ్గురి క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు. పోస్టర్లు మాత్రం అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కు మాతృ వియోగం
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ , ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు , మహేష్ బాబు తో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.