
ట్యాగ్ · 7 కథనాలు


"గాడ్సే " ఫస్ట్ లుక్ రిలీజ్

"సీతా మనోహర శ్రీ రాఘవ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అందాల నటుడు హరనాథ్ పౌరాణిక పాత్రలలో కూడా తనదైన ముద్ర వేశారు. రొమాంటిక్ హీరోగా హరనాథ్ ని అభిమానించే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆయన నటనను , నడకను వాళ్లు ఎంతగానో ఇష్టపడేవారు.ఇప్పటికీ చాలామంది అభిమానులు హరనాథ్ ను మరిచిపోలేదు. ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరూ ఎందుకు ఇండస్ట్రీకి రాలేదని అనుకునేవారు ఉన్నారు. ఇప్పుడు హరనాథ్ తమ్ముడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

'7 డేస్ 6 నైట్స్' ఫస్ట్ లుక్ రిలీజ్
‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను టాలీవుడ్ కు అందించిన నిర్మాత ఎం.ఎస్ రాజు. ఆతరువాత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఎం.ఎస్ రాజు మళ్లీ ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్నే దక్కించుకున్నారు. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. హైద్రాబాద్ తరువాత గోవా, మంగళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయనిట్. ఇక…

'7 డేస్ 6 నైట్స్' ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్
డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ఫస్ట్ లుక్ రిలీజ్
షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిన సుహాస్.. సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ మెల్లమెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. మజిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ తో పాటు పలు సినిమాల్లో తన కామెడీతో నవ్వించిన సుహాస్ ఇటీవల హీరోగా కూడా మారాడు. కలర్ ఫొటో సినిమాలో హీరోగా నటించి హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్తసినిమాతో వచ్చేస్తున్నాడు.

శ్రీవిష్ణు 'భళా తందనాన'.. గరుడ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్‌లో చాలా కొద్ది మంది హీరోలు మాత్రమే వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో ప్రతిసారీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు. ఇటీవలే గాలిసంపత్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.

"గాడ్సే " ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ హిట్ “Mr పర్ ఫెక్ట్ ” “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “, “అత్తారింటికి దారేది “, “క్షణం “వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన సత్యదేవ్ “బ్రోచే వారెవరురా “, “ఇస్మార్ట్ శంకర్ “, సరిలేరు నీకెవ్వరు ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో గుర్తింపు పొందారు. “బ్లఫ్ మాస్టర్” మూవీ తో హీరోగా మారిన సత్యదేవ్ “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “తిమ్మరుసు “, “గాడ్సే “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ "రామ్ సేతు "లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మహా సముద్రం.. 'కె.జి.యఫ్' విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్
అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల షూట్ కు బ్రేక్ పడగా.. త్వరలోనే మళ్లీ రీస్టార్ట్ చేయనున్నారు.