
ట్యాగ్ · 7 కథనాలు

హైదరాబాద్ లో "ఫైటర్ " మూవీ షూటింగ్ ?
"ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ లో అనన్య పాండే
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి - విజయ్ చిత్రం

#VD 10 షూటింగ్ ప్రారంభం
ఫైటర్ కోసం థాయ్ స్పెషలిస్టులు
పోరాట ఘట్టాలతో ప్రారంభం కానున్న `ఫైటర్`?

విజయ్-పూరీ సినిమా టైటిల్ 'ఫైటర్' కాదట..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. మొదటినుండి ఈ సినిమా టైటిల్ 'ఫైటర్' అనే ఫిక్స్ అయిపోయాం కదా అయితే ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదట. ఈ విషయాన్ని ఈ సినిమాకు సహనిర్మాత అయిన ఛార్మి స్వయంగా చెప్పడం జరిగింది.
హైదరాబాద్ లో "ఫైటర్ " మూవీ షూటింగ్ ?
పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు.
"ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ లో అనన్య పాండే
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో సూపర్ హిట్ మూవీస్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2", "పతి పత్ని ఔర్ వో " ఫేమ్ అనన్య పాండే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి - విజయ్ చిత్రం
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్న ఈ సినిమా... ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ షెడ్యూల్ లో విజయ్ తదితరులపై కొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరించారని తెలిసింది.

#VD 10 షూటింగ్ ప్రారంభం
ధర్మా ప్రొడక్షన్స్ సమర్పణ లో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడు గా యాక్షన్ ఎంటర్ టైనర్ #VD 10 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఫైటర్ గా నటిస్తున్న ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. #VD 10 మూవీ హిందీ తో పాటు దక్షిణాది భాషలలో రిలీజ్ కానుంది.
ఫైటర్ కోసం థాయ్ స్పెషలిస్టులు
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
పోరాట ఘట్టాలతో ప్రారంభం కానున్న `ఫైటర్`?
`ఇస్మార్ట్ శంకర్`తో బౌన్స్ బ్యాక్ అయిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్... తన నెక్ట్స్ వెంచర్ ని యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. `ఫైటర్` పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. కథానాయిక పాత్ర కోసం `ఇస్మార్ట్` గాళ్ నిధి అగర్వాల్, `వింక్` బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.