
ట్యాగ్ · 8 కథనాలు


సంతోష్ శోభన్ తో 'జాతి రత్నాలు' హీరోయిన్

రోడ్డుపై ఫరియా అబ్దుల్లా తీన్మార్ డ్యాన్స్

విష్ణు మంచు కు జోడీగా చిట్టి

ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ విశేషాలు

ఫరియా అబ్దుల్లా డ్రీమ్ రోల్

లక్కీ హైదరాబాదీ గర్ల్ ఫరియా అబ్దుల్లా

టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉంది - ఫరియా అబ్దుల్లా
క్లాసికల్ డ్యాన్సర్ , థియేటర్ ఆర్టిస్ట్ , మోడల్ ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ తోం కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవ్ చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ బంగార్రాజు , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీస్ లో అతిథి పాత్రలలో నటించి ఫరియా ప్రేక్షకులను అలరించారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ఐదుగురు కథానాయికలలో ఫరియా ఒకరు.

సంతోష్ శోభన్ తో 'జాతి రత్నాలు' హీరోయిన్
జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కు కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఫరియా కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

"బంగార్రాజు"మూవీ లో ఫరియా స్పెషల్ సాంగ్
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

రోడ్డుపై ఫరియా అబ్దుల్లా తీన్మార్ డ్యాన్స్
బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్ చేస్తాననీ ఫరియా చెప్పిన విషయం తెలిసిందే.

విష్ణు మంచు కు జోడీగా చిట్టి
బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్ చేస్తాననీ ఫరియా చెప్పారు.

ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ విశేషాలు
బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పలు విశేషాలు తెలిపారు. సినిమాలకు కొత్త కావొచ్చుకానీ, నటనలో మాత్రం సుదీర్ఘ అనుభవం ఉందంటున్న ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. స్కూల్ రోజుల్లో ఏటా సమ్మర్ క్యాంపులకు హాజరవుతూ యాక్టింగ్, పెయింటింగ్, డ్యాన్స్‌లాంటివి నేర్చుకునేదాన్ననీ , పెయింటింగ్ క్లాసులకి, సాహిత్యం క్లాసులకు అటెండ్ అయ్యాననీ, నాటకరంగంలో ఏడేళ్ల అనుభవం ఉందనీ , షార్ట్‌ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లలో నటించాననీ చెప్పారు.

ఫరియా అబ్దుల్లా డ్రీమ్ రోల్
థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా “జాతిరత్నాలు” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబడుతుంది. "జాతిరత్నాలు " మూవీ లో చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

లక్కీ హైదరాబాదీ గర్ల్ ఫరియా అబ్దుల్లా
స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. “జాతిరత్నాలు” మూవీ 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.