
ట్యాగ్ · 9 కథనాలు

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు - హీరో నితిన్
టాలీవుడ్ హీరో నితిన్, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు నితిన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా చిత్రయూనిట్ ప్రస్తుతం ఓ మాస్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తూ రిలీజ్ సిద్దమవుతుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇప్పటకే పలు పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈ…

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్- నాగవంశీ బెస్ట్ విషెస్
స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఒకవైపు షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్
యంగ్ హీరో నితిన్ ,నాపేరు సూర్య డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచగా రీసెంట్ గా విడుదలైన డేంజర్ పిల్లా అనే పాట కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.వీటికి తోడు సీనియర్ హీరో,యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ విలన్ గా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి తాజాగా టీజర్ కూడా విడుదలచేశారు.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ గెటప్‌లో నితిన్, లుక్ వైరల్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్…

నితిన్ ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మ్యాన్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'లో టాలీవుడ్ యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

నితిన్ సినిమాలో రాజశేఖర్
యంగ్ హీరో నితిన్,డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.ప్రస్తుతం షూటింగ్ లో వున్న ఈసినిమా ఈ డిసెంబర్ 8న విడుదలకానుంది. ఈసినిమాలో నితిన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమానుండి సప్రైజ్ అప్డేట్ వచ్చింది.ఈసినిమాలో సీనియర్ హీరో,యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈరోజే ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు.అందుకు సంబంధించిన వీడియో ను మేకర్స్ రిలీజ్ చేశారు.

నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ నుండి డేంజర్ పిల్లా సాంగ్ రిలీజ్
స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఒకవైపు షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ సింగిల్ డేంజర్ పిల్లా అనే పాటను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా…

నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలు లిస్ట్ లో ఉండగా అందులో వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఔట్ అండ్ ఔట్ యక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో నితిన్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది ఈసినిమా. ఇక ఇన్ని రోజులు నితిన్ 32 అనే టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకోగా రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు ఎక్స్‌ట్రా అనే టైటిల్ ను పెట్టగా ఆర్డినరీ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్…