
ట్యాగ్ · 6 కథనాలు

హీరోలు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి..!
పూజాహెగ్డే కలల హీరో ?
‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ గా అల్లు అరవింద్
అలీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్?

ఏజెంట్ - ఫ్యాన్స్ కోసం మొదటిసారిగా అఖిల్
ఈమధ్య సినిమా ప్రమోషన్స్ ఎంత కొత్తగా ఉంటే ప్రేక్షకులకు అంత రీచ్ అవుతుంది ఆసినిమా. అందుకే మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాస్ తో వస్తుంటారు. సినిమాలపై బజ్ క్రియేట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా అలరించిన అఖిల్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్ తో వచ్చేస్తున్నాడు ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
హీరోలు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి..!
కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దీనితో నిర్మాతలు కాస్త ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో లాగ షూటింగ్ లు పూర్తి చేసి సినిమాలు రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పరిస్థితులను అర్థంచేసుకోవాలని అన్నారు మణిరత్నం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘‘థియేట్రికల్ బిజినెస్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంత వరకు స్టార్ హీరోలు, పెద్ద టెక్నీషియన్లు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది’’ అని అన్నారు. మరి ఇప్పటికే కొంతమంది హీరోలు…
పూజాహెగ్డే కలల హీరో ?
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే బ్లాక్ బస్టర్" DJ", "అరవింద సమేత వీర రాఘవ" , "మహర్షి", "గద్దల కొండ గణేష్ ", "అల .. వైకుంఠపురములో .." మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే, అఖిల్ అక్కినేని జంటగా రూపొందిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "Prabhas 20 "మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్4" ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ "కభీ ఈద్ కభీ దివాలీ "మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ గా అల్లు అరవింద్
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సీనియర్ హీరోనా, యంగ్ హీరోనా అనేవి పట్టించుకోకుండా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేస్తున్నారు. అదే ఆయనను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌ను చేసింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్నాడు.
అలీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. అలీ మాతృమూర్తి జైతన్ బీబీ (75) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. రాజమండ్రిలో చనిపోవడంతో మృతదేహాన్ని గురువారం ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు.

బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్?
‘పందెం కోడి 2’, ‘సర్కార్’, ‘మారి 2’ వంటి తమిళ అనువాద చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్. ఆ యా చిత్రాల్లో విలనిజాన్ని పండించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఈ సారి తెలుగులో ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.