
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2

జాంబిరెడ్డి - ప్రభాస్ చేతుల మీదుగా 'బిగ్ బైట్'
షూటింగ్ పూర్తి చేసుకున్న జాంబీ రెడ్డి
ప్రశాంత్ వర్మ కరోనా సినిమా టైటిల్ రిలీజ్

ప్రశాంత్ వర్మ "అ!" మూవీ సీక్వెల్ అప్ డేట్

త్వరలో "జాంబి రెడ్డి" సీక్వెల్
యాపిల్ ట్రీస్ స్టూడియోస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "అ ! "మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా , ఆనంది జంటగా వైరస్ బారిన పడిన ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "జాంబి రెడ్డి" మూవీ ఘనవిజయం సాధించింది. "జాంబి "జానర్ లో రూపొందిన తొలి తెలుగు సినిమా "జాంబి రెడ్డి" మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
జాంబిరెడ్డి - ప్రభాస్ చేతుల మీదుగా 'బిగ్ బైట్'
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'జాంబిరెడ్డి'. మొదటిసారి ఇలాంటి జోనర్లో సినిమా రావడంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకూ, మోషన్ పోస్టర్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసింది. ఆ పనులు కూడా చివరిదశకు వచ్చేసాయి.
షూటింగ్ పూర్తి చేసుకున్న జాంబీ రెడ్డి
గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలనటునిగా ఎన్నో సినిమాల్లో అలరించిన తేజ సజ్జా ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా "జాంబీ రెడ్డి "టీమ్ సర్ ప్రైజ్
సక్సెస్ ఫుల్ "అ !" మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో హారర్ , థ్రిల్లింగ్ "జాంబీ రెడ్డి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అత్యున్నత సాంకేతికత తో, సరికొత్త విజన్ తో "జాంబీ రెడ్డి " మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. యానిమేషన్ , గ్రాఫిక్స్ హైలైట్ గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది .ఆ పోస్టర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. కరోనా కు , జాంబీ రెడ్డి కి సంబంధం తెర మీద చూడాల్సిందే.
"జాంబీ రెడ్డి "టైటిల్ పై ప్రశాంత్ వర్మ ప్రెస్ నోట్
సక్సెస్ ఫుల్ సైకలాజికల్ థ్రిల్లర్ "అ !" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ , ఆ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2 నేషనల్ అవార్డ్స్ అందుకున్న "అ !" మూవీ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "కల్కి " మూవీ నిరాశ పరచింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు నిజ జీవిత సంఘటనలతో "జాంబీ రెడ్డి" మూవీ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన "జాంబీ రెడ్డి " మూవీ టైటిల్ లోగో కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.
ప్రశాంత్ వర్మ కరోనా సినిమా టైటిల్ రిలీజ్
సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా 'అ' సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రశాంత్ వర్మ "అ!" మూవీ సీక్వెల్ అప్ డేట్
హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా ప్రధాన పాత్రలలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ "అ!" మూవీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ కై ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూశారు.