
ట్యాగ్ · 9 కథనాలు

పరశురామ్.. ఫీమేల్ సెంట్రిక్ మూవీ
నవరసభరితంగా మహేష్, పరశురామ్ చిత్రం

జూలై నుంచి మహేష్ - పరశురామ్ చిత్రం?

ఫ్యామిలీ స్టార్ సక్సెస్ పై పరుశురాం కాన్ఫిడెన్స్
ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీయాలంటే కొందరు డైరెక్టర్లు మాత్రమే తీయగలరు. అందులో డైరెక్టర్ పరుశురాం పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది.

"సర్కారు వారి పాట"లో మహేష్ బాబు క్యారెక్టర్ పై పరశురామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సితార 'పెన్నీ' సాంగ్ మేకింగ్
మహేష్ బాబు గారాల పట్టి సితారకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుండే సితారకు మంచి క్రేజ్ ఉంది. తన వీడియోలతో, సోషల్ మీడియా అప్ డేట్స్ తో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది సితార. ఇక రీసెంట్ గా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాతో ఎంట్రీ కూడా ఇస్తుంది. ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన పెన్నీ సాంగ్ లో సితార కనిపించి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు ఆ పాటలో తన స్టెప్స్ కు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆమె వేసిన స్టెప్పులకు మహేష్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రేమికులంతా ఫిదా అయిపోయారు. ఇక సితార కూడా అడియన్స్ కు తన సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ కూడా…

హ్యాపీ బర్త్ డే నమ్రత-నా ప్రపంచాన్ని పంచుకున్నందుకు థ్యాంక్స్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ఫ్యామిలీ పరంగా కానీ.. ఇటు కెరీర్ పరంగా కానీ మహేష్ సూపర్ సక్సెస్ లో ఉన్నాడంటే ఆ సక్సెస్ వెనుక నమ్రత కూడా ఉందన్న సంగతి ఒప్పుకోవాల్సిందే. ఇక నేడు నమ్రత తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మహేష్ నమ్రతకు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. హ్యాపీ బర్త్ డే నమ్రత.. నా ప్రపంచాన్ని నాతో పంచుకున్నందుకు నీకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు మహేష్.

'సర్కారు వారి పాట' కొత్త రిలీజ్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ముందుగా దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవలే స్పెయిన్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా షూట్ చేసినట్టు తెలుస్తుంది.
పరశురామ్.. ఫీమేల్ సెంట్రిక్ మూవీ
2018 పంద్రాగస్టుకి విడుదలైన ‘గీత గోవిందం’తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్. కాగా, తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో చేయబోతున్నాడు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ సినిమా పట్టాలెక్కనుంది. అలాగే, యువసామ్రాట్ నాగచైతన్యతోనూ ‘నాగేశ్వరరావు’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడు పరశురామ్. మహేష్ సినిమా పూర్తయ్యాక చైతు సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
నవరసభరితంగా మహేష్, పరశురామ్ చిత్రం
‘గీతగోవిందం’(2018)తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్. స్వల్పవిరామం అనంతరం తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారాయన. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్.. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత సెట్స్ పైకి వెళ్లనుంది.

జూలై నుంచి మహేష్ - పరశురామ్ చిత్రం?
ఈ సంక్రాంతికి విడుదలైన `సరిలేరు నీకెవ్వరు`తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ని అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కథానాయకుడిగా తనకది 26వ చిత్రం. కాగా, తన 27వ సినిమాని `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడట మహేష్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని జీఎంబి ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మహేష్, పరశురామ్ చిత్రం?
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్, కొరటాల శివ హోమ్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా మే లేదా జూన్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని ప్రచారం సాగుతోంది.