కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bigg Boss 4

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

బిగ్ బాస్

బిగ్ బాస్ 4- బీభత్సం చేసిన రాక్షసులు

బిగ్ బాస్ 4 - 7వ వారంలో ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్కు ఇచ్చేసాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా "కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు" అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్ లో బిగ్‌బాస్‌పురం రాజ్యంలో అరియానా, అవినాష్‌, అఖిల్‌, మెహ‌బూబ్, హారిక‌ కొంటె రాక్ష‌సుల టీమ్‌లో ఉండ‌గా, నోయల్, అభిజిత్, లాస్య, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, సోహెల్ మంచి మనుషులు టీమ్ లో ఉన్నారు. ఇక టాస్క్ లో ఒక్కో రాక్ష‌సుడిని మంచి మ‌నిషిగా మార్చిన ప్ర‌తీసారి రావ‌ణుడి బొమ్మ‌లోని ప‌ది త‌ల‌ల్లో రెండింటిని ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుంది. అందుకు బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తాడు. టాస్క్ ను పూర్తి చేసిన ప్రతిసారీ రెండు తలలను పగల గొట్టాలి. అలా ముగ్గురు రాక్ష‌సులను‌…

TFN Adminవాట్సాప్
Bigg Boss 4- Contestant Nominations For 7th Week Elimination Is Out
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 7వ వారం నామినేషన్స్ లిస్ట్

బిగ్ బాస్ - 4.. సక్సెస్ ఫుల్ గా 6వారాలు పూర్తి చేసుకున్న హౌస్ 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఎప్పటి లాగే పాట‌తో ఇంటి స‌భ్యులు నిద్రలేవగా.. ఆ త‌ర్వాత ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీ అయ్యారు. ఇక కుమార్ సాయి ఇచ్చిన బిగ్ బాంబ్ వల్ల మాస్ట‌ర్ బాత్‌రూం ప‌రిస‌రాల‌ను క్లీన్ చేసే పనిలో పడ్డారు. మరోపక్క హారిక పొడవాటి టీ-షర్ట్ ను వేసుకోగా దానికి హారిక ను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు.‌ అవినాష్ కామెడీకి పక్కనే ఉన్న అఖిల్, సోహైల్‌ నవ్వుకున్నారు.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 ఎమోషన్ తో నిండిపోయిన హౌస్

బిగ్ బాస్ 4- నిజానికి వారంలో మూడు రోజులు అంటే సోమవారం నామినేషన్స్.. ఇంకా మూడు రోజులు కెప్టెన్సీ టాస్క్ అంటూ బిజీగా వుండే హౌస్ మేట్స్ గురువారం.. శుక్రవారం మాత్రం కొంచం ఖాళీగానే ఉంటారు. ఇక వీకెండ్స్ శనివారం.. ఆదివారం అంటే నాగార్జున వస్తాడు.. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఉంటది. ప్రతి వారం లాగే ఈ గురువారం కూడా కొంచం చప్పగానే సాగింది. హౌస్ మొత్తం ఎమోషన్ తో నిండిపోయింది.

TFN Adminవాట్సాప్
Noel Sean Becomes Captain For Second Time In Bigg Boss 4 Show
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - రెండోసారి కెప్టెన్ అయిన నోయ‌ల్‌

బిగ్ బాస్ 4.. మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్నటి కంటే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకా కష్టమైన టాస్క్ లు ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఏడో డీల్‌ గా త‌ల‌, గ‌డ్డం స‌గం గీసుకోవాలి. అయితే ఈ టాస్క్ మాత్రం రెండు టీమ్స్ చేయమని చెప్పేసరికి బిగ్ బాస్ కూడా క్యాన్సిల్ చేసాడు. ఎనిమిదో డీల్‌ గా పేడ క‌లిగిన బాత్‌ట‌బ్‌లో దిగాలి. అఖిల్ గంట మోగించ‌డంతో అత‌ని టీమ్‌లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వ‌చ్చింది. తొమ్మిదో డీల్‌ గా ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అర‌టి ప‌ళ్ల‌ను తినాలి. అరియానా గంట మోగించ‌డంతో అభిజిత్‌ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు…

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్‌బాస్ 4 - 'అమీ తుమీ' తేల్చుకుంటున్న హౌస్ మేట్స్

బిగ్ బాస్4- బిగ్ బాస్ 6వ వారంలో అప్పుడే రెండో రోజులు పూర్తయింది. ఇక ముందు మార్నింగ్ మస్తీలో భాగంగా సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో అమ్మ రాజశేఖర్ వంట వండుతూ... అత‌డిని చ‌పాతీలా రుబ్బుతూ.. ఆడుకున్నారు. అవినాష్ బెడ్‌లా మారిపోగా అమ్మ రాజ‌శేఖ‌ర్ అత‌డిపై విశ్రాంతి తీసుకుంటూ ప‌డుకున్నాడు. అఖిల్ వాష్‌రూమ్‌గా మారిపోగా అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెడీ చేసి న‌వ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అంద‌రూ మ‌రోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుప‌డ్డారు. దివి కాసేపు డ‌స్ట్‌బిన్‌లా చేసింది. మ‌రోవైపు అభిజిత్ సోహైల్‌కు అంద‌రూ ఇచ్చే స‌ల‌హానే మ‌ళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం…

TFN Adminవాట్సాప్
Bigg Boss 4 Show To Bring Out The Contestants Elimination List For The 6th Week
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 6వ వారం నామినేషన్ లిస్ట్

బిగ్ బాస్ సీజ‌న్ 4 - ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సుజాత వెళ్ళిపోతూ బిగ్ బాంబు వేయడంతో ఈ వారం మొత్తం సోహైల్ గిన్నెలు తోమాల్సి వచ్చింది. బిగ్ బాంబ్ లో భాగంగా సోమ‌వారం రోజు ఎపిసోడ్ సోహైల్ గిన్నెలు క‌డుగుతుండ‌డాన్ని చూపించారు. అయితే ప‌ర్స‌న‌ల్ క‌ప్పులు కూడా క‌డ‌గ‌కుండా అక్కడే పెట్టి వెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండటంతో అమ్మ రాజశేఖర్ కలుగ చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. అయినా వినకపోవడంతో అక్కడ పెట్టెయ్ నేనే కడుగుతా అని అమ్మ రాజశేఖర్ చెప్పడంతో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త వాదన జరిగింది.

TFN Adminవాట్సాప్

షేర్