
ట్యాగ్ · 66 కథనాలు · పేజీ 4


చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?

"భోళా శంకర్ "మూవీ రికార్డ్స్

డేరింగ్ లేడీ ఆఫ్ టాలీవుడ్

మెగా మూమెంట్స్

'భోళా శంకర్' గా మెగాస్టార్

'భోళా శంకర్'ను మొదలుపెట్టే ప్లాన్ లో మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. దీనితో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను దృష్టి పెట్టుకొని స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొద్దిరోజులుగా ఊటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది.

చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం "గాడ్ ఫాదర్"మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్", బాబీ దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తమిళ సూపర్ హిట్ “వేదాళం" మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్” మూవీ తెరకెక్కనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో చిరంజీవి చెల్లెలు గా మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నారు.

"భోళా శంకర్ "మూవీ రికార్డ్స్
ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందనున్న తమిళ సూపర్ హిట్ “వేదాళం తెలుగు రీమేక్ కు “భోళా శంకర్”టైటిల్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

డేరింగ్ లేడీ ఆఫ్ టాలీవుడ్
తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మెగా మూమెంట్స్
మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే అభిమానుల కేరింతలతో, కొత్త సినిమాల అప్ డేట్స్ తో కోలాహలం గా జరిగింది. రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి . బర్త్ డే సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందే మూవీస్ టైటిల్స్ , పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సూపర్ హిట్ "లూసిఫర్ "తెలుగు రీమేక్ మూవీకి "గాడ్ ఫాదర్ "టైటిల్ ని ప్రకటించారు.

'భోళా శంకర్' గా మెగాస్టార్
ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఆయన సినిమాల నుండి వచ్చే అప్ డేట్స్ కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ కూడా చిరు అభిమానుల కోసం పలు అప్ డేట్స్ తో రెడీ గా ఉన్నారు. దీనిలో భాగంగానే నిన్ననే లూసిఫర్ రీమేక్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు నిన్ననే ప్రకటించారు.