
ట్యాగ్ · 7 కథనాలు


భోళా శంకర్ టీజర్ రిలీజ్

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

త్వరలో సెట్స్ కు "భోళా శంకర్"

'భోళా శంకర్' లాంగ్ షెడ్యూల్ కు ప్లాన్..!

'భోళా శంకర్'ను మొదలుపెట్టే ప్లాన్ లో మెహర్ రమేష్

"భోళా శంకర్ "మూవీ రికార్డ్స్

మీకు నచ్చిన మాసీ టీజర్?
సమ్మర్ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటివరకూ పలు సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక రిలీజ్ కు పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. వాటిలో అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న భోళాశంకర్ ఇంకా భగవంత్ కేసరి సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో అలానే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్, భగవంత్ కేసరి సినిమాలతో వచ్చేస్తున్నారు. మరవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న హ్యాట్రిక్…

భోళా శంకర్ టీజర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ వేదాలంకు రీమేక్ తెరకెక్కుతున్న ఈసినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత తను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈసినిమానుండి విడుదలైన మొదటి సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈటీజర్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు. టీజర్ లో చిరు లుక్ హైలైట్ అయ్యింది.చాలా యాక్టీవ్ గా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పాడు.మొత్తానికి టీజర్ అయితే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్న చిరు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం మూవీలోని సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో హీరోహీరోయిన్ల పై ఒక సాంగ్ ని చిత్రీకరించగా, హైదరాబాద్ లో ఒక పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. మరోవైపు ఈసినిమా ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది.

త్వరలో సెట్స్ కు "భోళా శంకర్"
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన "ఆచార్య " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ "లూసిఫర్" మలయాళ మూవీ రీమేక్ "గాడ్ ఫాదర్" మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ "వేదాళం" తమిళ మూవీ తెలుగు రీమేక్ "భోళా శంకర్ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'భోళా శంకర్' లాంగ్ షెడ్యూల్ కు ప్లాన్..!
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీదున్నాడు. వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇందులో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇందులో గాడ్ ఫాదర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా… భోళా శంకర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

'భోళా శంకర్'ను మొదలుపెట్టే ప్లాన్ లో మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. దీనితో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను దృష్టి పెట్టుకొని స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొద్దిరోజులుగా ఊటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది.

"భోళా శంకర్ "మూవీ రికార్డ్స్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందనున్న తమిళ సూపర్ హిట్ “వేదాళం తెలుగు రీమేక్ కు “భోళా శంకర్”టైటిల్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.