
ట్యాగ్ · 6 కథనాలు


"భీమ్లా నాయక్ "ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'భీమ్లానాయక్'

సినిమాటోగ్రాఫర్ కు భీమ్లా నాయక్ థ్యాంక్స్

థియేటర్‌లో చూసిన ఫస్ట్ సినిమా "భీమ్లానాయక్"- నజ్రియా నజీమ్
2006 సంవత్సరం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ చిత్రపరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన నజ్రియా "మాడ్ డాడ్" మూవీ తో కథానాయికగా మారారు. పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో నజ్రియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. 2014 లో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ను నజ్రియా వివాహం చేసుకున్నారు. లేటెస్ట్ గా టాలెంటెడ్ యాక్ట్రెస్ నజ్రియా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.

"భీమ్లా నాయక్ "ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

'భీమ్లానాయక్'.. 5వ షోకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు రానా అభిమానులు కూడా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చేసింది. ఇంకా కొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ - రానా కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్ సినిమా రిలీజ్ కాబోతుంది. మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. అంతేకాదు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. ఇక ఇప్పుడు చిత్రయూనిట్ కు మరో బంపరాఫర్ ఇచ్చింది టీఎస్ ప్రభుత్వం.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'భీమ్లానాయక్'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుండి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక రీఎంట్రీ తర్వాత కూడా పవన్ ఏ మాత్రం తగ్గట్లేదు. వస్తూ వస్తూనే వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ తో బోణీ కొట్టాడు. ఇక ఇప్పుడు అందరి చూపు భీమ్లానాయక్ పై ఉంది. ఈసినిమాకు కూడా మాములు క్రేజ్ లేదు. గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచితే.. పాటలు మరో రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా సంక్రాంతి బరిలో దిగాలి కానీ థర్డ్ వేవ్ వల్ల సాధ్యంకాలేదు.

"భీమ్లా నాయక్" సెట్స్ లో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1వ తేది రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హీరో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

సినిమాటోగ్రాఫర్ కు భీమ్లా నాయక్ థ్యాంక్స్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.