
ట్యాగ్ · 6 కథనాలు


పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్

లొకేషన్స్ వేటలో 'భవదీయుడు భగత్ సింగ్' టీమ్

పవన్ కళ్యాణ్ కు జోడీగా పూజాహెగ్డే

భవదీయుడు భగత్ సింగ్-షూట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్?
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. దీంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఎప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ సినిమాలతో పాటు ఇప్పుడు ఎక్కువ సమయం రాజకీయల్లో గడుపుతుండటంతో లిస్ట్ లో ఉన్న సినిమాలు పెండింగ్ లో పడ్డాయి. ఈనేపథ్యంలోనే ఎప్పుడో పూర్తవ్వాల్సిన హరిహర వీరమల్లు సినిమా కూడా ఇంతవరకూ పూర్తికాలేకపోయింది. దీంతో…

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీంతో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలానే హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. వీటిలో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు.

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన "గబ్బర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ తెరకెక్కనుంది. పూజాహెగ్డే కథానాయిక. అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయినా ఈ మూవీ పై ఏ ఒక్క అప్ డేట్ రాలేదని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

లొకేషన్స్ వేటలో 'భవదీయుడు భగత్ సింగ్' టీమ్
రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంగా చేస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైనర్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

“భవదీయుడు భగత్ సింగ్”మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడీగా పూజాహెగ్డే
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్ సింగ్”మూవీ తెరకెక్కనుంది.బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్ ” మూవీ తరువాత దర్శకుడు హరీష్ శంకర్ , హీరో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లో కథానాయికగా పూజాహెగ్డే ఎంపిక అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “దువ్వాడ జగన్నాథమ్ “,”గద్దలకొండ గణేష్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి.

పవన్ కళ్యాణ్ కు జోడీగా పూజాహెగ్డే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న "భీమ్లా నాయక్" , క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు" మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "భీమ్లా నాయక్" మూవీ 2022 జనవరి 12 వ తేదీ , "హరిహర వీరమల్లు" మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.