కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Balakrishna Next Project News

ట్యాగ్ · 6 కథనాలు

సినిమా వార్తలు

బాలయ్య 106 లాంచ్ అప్పుడే..!

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
This Crazy Actor Director Combo Soars Expectations Among Telugu Audience
సినిమా వార్తలు

అనిల్ తో బాలయ్య - క్రేజీ కాంబినేషన్

తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్రేజీ కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన క్రేజీ కాంబినేషన్ లో ఒకటే పూరీ-బాలయ్య సినిమా. ఈ సినిమాలో పూరీ బాలయ్యను మాములు హైపర్ గా చూపించలేదు. ఇక ఇప్పుడు బాలయ్య మరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి... ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ తో సరిలేరు మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు. దీనితో అనిల్ తో సినిమాలు చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌య్య‌, బి. గోపాల్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్టోరియ‌ల్ తో బిజీగా ఉన్నారు. న‌టుడిగా ఆయ‌న‌క‌ది 106వ సినిమా. కాగా, త‌న 107వ చిత్రాన్ని త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రైన బి. గోపాల్ కాంబినేష‌న్ లో చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని జూన్ 10న బాలయ్య పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే బాల‌య్య‌, బి. గోపాల్ కాంబినేష‌న్ మూవీకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది.

Team TFNవాట్సాప్
Blockbuster Pair Balakrishna And B Gopal Join Hands For A Wholesome Family Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Balakrishna,B Gopal,Balakrishna Latest News,Balakrishna New Movie Updates,
సినిమా వార్తలు

సెంటిమెంట్ డ్రామాగా బాల‌కృష్ణ‌, బి. గోపాల్ చిత్రం?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఏస్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ సుదీర్ఘ విరామం త‌రువాత మ‌రోమారు జ‌ట్టుక‌డుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ ఈ సినిమాకి క‌థ‌ను అందిస్తున్నాడ‌ని, కుటుంబ బంధాల నేప‌థ్యంలో సాగే చిత్రంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని వినిపిస్తోంది. పెద్ద‌ల‌తో, త‌ల్లిదండ్రుల‌తో, తోడ‌బుట్టిన‌వాళ్ళ‌తో ఎలా న‌డుచుకోవాలో, వారిని ఎలా ట్రీట్ చేయాలో చెప్పే క‌థాంశంతో బాల‌య్య‌, బి.గోపాల్ కాంబినేష‌న్ మూవీ ఉంటుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
balakrishna-nbk-106-going-to-be-a-socio-fantasy-movie
సినిమా వార్తలు

`న‌వ‌గ్ర‌హాలు` చుట్టూ తిరిగే క‌థ‌తో `య‌న్.బి.కె. 106`?

బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను.. ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌డుతున్న సంగ‌తి తెలిసిందే. డివోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. అందులో ఒక పాత్ర కోసం అఘోరాగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హిట్ కాంబోను రిపీట్ చేసే ప్లాన్ లో బాలయ్య...!

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని విధంగా అఘోర పాత్రలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. కాగా గతంలో వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా భారీ విజయం సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

TFN Adminవాట్సాప్

షేర్