
ట్యాగ్ · 6 కథనాలు


ఇతర కథానాయికలను పోటీగా భావించను- అంజలి
సోషల్ మీడియా లో బర్త్ డే శుభాకాంక్షలు
అంజలి క్వారంటైన్ డబ్బింగ్

పవన్ సినిమాలో అంజలి ఉన్నట్టే..!

`పింక్` రీమేక్ లో అంజలి?

టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి
కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సీనియర్లకు ఛాన్స్ లు తగ్గుతాయన్న ఫార్ములాను నేను అస్సలు నమ్మనంటుంది తెలుగుమ్మాయి హీరోయిన్ అంజలి. నిజానికి అవ్వడానికి మనది తెలుగు ఇండస్ట్రీ అయినా ఇక్కడ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణిస్తుంది మాత్రం చాలా తక్కువనే. కాస్త ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలు కూాడా సినీ ప్రపంచంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి అంజలి. ముందు తమిళ్ సినిమాల్లో నటించిన తరువాత తెలుగు తెరకు పరిచయమైంది అంజలి. ఇక ఇక్కడ పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కొత్త కొత్త…

ఇతర కథానాయికలను పోటీగా భావించను- అంజలి
"ఫొటో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి "కాట్రాడు తమిళ "మూవీ తో కోలీవుడ్ , "హొంగనసు "మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అంజలి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ", "గీతాంజలి "మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం "ఆనందభైరవి ", "F 3 ", "పూచండి "(తమిళ ), "శివప్ప "(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు.
సోషల్ మీడియా లో బర్త్ డే శుభాకాంక్షలు
"ఫొటో " తెలుగు మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అంజలి దక్షిణాది భాషలన్నింటిలోనూ పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అంజలి కీలక పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " విడుదలకు సిద్ధంగా ఉంది.
అంజలి క్వారంటైన్ డబ్బింగ్
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా స్తంభించిపోయిన చిత్ర పరిశ్రమకు తమిళనాడు ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకునేలా వెసులుబాటు కల్పించింది. దీంతో సినీ తారలు మోడరన్ టెక్నాలజీ తో ఇంటినుండే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు.

పవన్ సినిమాలో అంజలి ఉన్నట్టే..!
పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు రెండింటినీ చాలా బ్యాలన్స్ చేస్తూ వస్తున్నాడు. షూటింగ్ పనులు చూసుకుంటూనే మరోపక్క రాజకీయాలను కూడా చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. వచ్చే నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ను ముగించి.. మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

`పింక్` రీమేక్ లో అంజలి?
హిందీ బ్లాక్ బస్టర్ మూవీ `పింక్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కనున్న ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.