
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2

టాలీవుడ్ లో దర్శకుడిగా 5సంవత్సరాలు పూర్తి

'F3'ని లైన్ లో పెట్టనున్న అనిల్
`ఎఫ్ 3` స్క్రిప్ట్ లాక్ చేసిన అనిల్ రావిపూడి?

అనిల్ రావిపూడి సరికొత్త ట్రాక్ రికార్డు

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డ్రీమ్
సూపర్ హిట్ మూవీ "పటాస్" తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్" , "F 2", "సరిలేరు నీకెవ్వరు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అనిల్ బ్లాక్ బస్టర్ "F 2" మూవీ సీక్వెల్ "F 3 " మూవీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో దర్శకుడిగా 5సంవత్సరాలు పూర్తి
సూపర్ హిట్ మూవీ "శౌర్యం " తో డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. డైలాగ్ రైటర్ గా అనిల్ రావిపూడి పనిచేసిన "కందిరీగ", "సుడిగాడు" మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ "పండగ చేస్కో" మూవీ కి అనిల్ స్క్రిప్ట్ అందించారు. సక్సెస్ ఫుల్ "పటాస్" మూవీ తో అనిల్ దర్శకుడిగా మారారు. "పటాస్" మూవీ 2015 సంవత్సరం జనవరి 23 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది.

'F3'ని లైన్ లో పెట్టనున్న అనిల్
మొత్తానికి గత ఏడాది పొంగల్ కి, ఈ ఏడాది పొంగల్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో వున్నాడు అనిల్ రావిపూడి. మొదటి నుండి కామెడీకి పెద్ద పీట వేసి సినిమాలు తెస్తుంటాడు అనిల్. అందుకే ఇప్పటివరకూ అతని కెరీర్ లో ప్లాప్స్ లేవు. ఏవరేజ్ లేకపోతే హిట్స్ నే దక్కించుకున్నాడు. గత సంక్రాంతి వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లతో 'ఎఫ్2' ను తెరకెక్కించి సంక్రాంతికి రిలీజ్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రీసెంట్ గా మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని తీసి.. హిట్ కొట్టి సంక్రాంతి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు అనీల్.
`ఎఫ్ 3` స్క్రిప్ట్ లాక్ చేసిన అనిల్ రావిపూడి?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచిన చిత్రం `ఎఫ్ 2`. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు. కాగా, 2019 సంక్రాంతి విజేతగా నిలచిన `ఎఫ్ 2`కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది.

అనిల్ రావిపూడి సరికొత్త ట్రాక్ రికార్డు
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. నాలుగేళ్ళ క్రితం విడుదలైన `పటాస్` చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన అనిల్... ఆ తరువాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతోనూ మెప్పించాడు. ఇక తాజాగా విడుదలైన `ఎఫ్ 2` ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. అంతేకాదు... వంద కోట్ల గ్రాస్ క్లబ్‌లోనూ చేరిపోయింది... మీడియం బడ్జెట్ సినిమాల పరంగా కొత్త రికార్డుని సృష్టించింది. ఇదిలా ఉంటే... తన తొలి నాలుగు చిత్రాలతో అనిల్ ఓ కొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే... తన ప్రతి చిత్ర కథానాయకుడికి కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌ని అందించాడు అనిల్.

ఫీమేల్ ఆడియన్స్ కు మెసేజ్ ఇవ్వనున్న ఎఫ్2 డైరెక్టర్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ఎఫ్2. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. ఈ పది రోజులు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు.