కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Yash Upcoming Movie Details On Cards

ట్యాగ్ · 8 కథనాలు

సినిమా వార్తలు

కె.జి.యఫ్2 సెట్ లోఅడుగుపెట్టిన రాఖీ భాయ్

కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ కరోనా వచ్చి నిరాశనే మిగిల్చింది. ఇక ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి షూటింగ్ పూర్తయ్యేది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు ఈ షూటింగ్ లో రాఖీ భాయ్ కూడా అడుగుపెట్టాడు. ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు. అంతేకాదు అలలను ఆపడం కష్టం.. కానీ ఆ అలలలో ఈదడం నేర్చుకోవచ్చు.. చాలా గ్యాప్ తర్వాత కె.జి.యఫ్2 లో షూట్ కు రెడీ అవుతున్నా అంటూ ఇన్స్టా లో పేర్కొన్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కె.జి.యఫ్ 2 సెట్ లో అడుగుపెట్టనున్న యష్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్2. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. బెంగ‌ళూరులో వేసిన సినిమా సెట్స్ లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఇదిలా ఉండగా ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. రేపటినుండి షూటింగ్ కు వెళ్లనున్నాడట. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ షూటింగ్ మొత్తం అక్టోబర్ చివరికల్లా పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

స్పెషల్ డే రోజు కె.జి. ఎఫ్ 2 టీజర్..?

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి. ఎఫ్ 2 సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూసారో.. అంత లేట్ అయింది. అయితే కావాలని లేట్ చేయలేదులెండి. కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. మళ్లీ కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ను మొదలు పెట్టారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జూనియర్ యష్ నామకరణం వేడుక

కన్నడ రాకింగ్ స్టార్ యష్ గత కొన్ని నెలల క్రితమే తన కుమారుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలలు వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫొటోస్ షేర్ చేసాడు. ఇక తన కొడుకుని పరిచయం చేసి అప్పుడే ఆరు నెలలు అయిపోతుంది. అప్పటినుండి కుమారుడికి సంబంధించిన ఫోటోలు త‌ర‌చూ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా నామ‌కర‌ణ వేడుక జ‌రిపించారు యష్ దంపతులు. తమ ఫాం హౌజ్‌లో కొద్ది మంది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మాన్ని జరిపారు. యథర్వ్ యష్ అనే పేరుని త‌న కుమారుడికి పెట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను యష్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసాడు.

TFN Adminవాట్సాప్
KGF Chapter 2 Movie Team Releases An Interesting Update.
సినిమా వార్తలు

"KGF చాప్టర్ 2 " మూవీ అప్ డేట్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. అదే టీమ్ తో ఆ మూవీ సీక్వెల్ "KGF చాప్టర్ 2 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
KGF 2 Movie Shoot Resumes Post Lockdown
సినిమా వార్తలు

'కె.జి.యఫ్' 2 - బ్యాక్ టు షూట్

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. కరోనా లేకపోతే ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఉండేది. చెప్పినట్టే అక్టోబర్ లో రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. అయితే ఇంకా కొద్దిరోజుల షూట్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మళ్ళీ షూట్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కె.జి.యఫ్' కు 'బాహుబలి' సినిమానే స్పూర్తి..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ఇక ఈ సినిమా ఎన్నో సినిమాలకు స్ఫూర్తి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు బాహుబలి ఒక ఇన్స్పిరేషన్. అంతేకాదు ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ కి కూడా బాహుబలినే ఇన్స్పిరేషన్ అంటున్నాడు యష్.

TFN Adminవాట్సాప్
KGF 2 To Hit Theatres For 2021 Sankranthi
సినిమా వార్తలు

2021 సంక్రాంతికి 'కె.జి.యఫ్2'..?

కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోవడంతో... దాని ప్రభావం సినిమాల రిలీజ్ లపై కూడా పడింది. దీనివల్ల కె.జి.యఫ్2 సినిమా రిలీజ్ లో మార్పులు వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ దశలో వుంది. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. పరిస్థితులు బాగుండి వుండే మరో రెండు మూడు నెలల్లో రిలీజ్ అయ్యేదే. అయితే చిత్రయూనిట్ మాత్రం తొందర్లోనే సినిమా రిలీజ్ చేస్తామంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది…

TFN Adminవాట్సాప్

షేర్