
ట్యాగ్ · 6 కథనాలు


ఇటలీ లో "రంగ్ దే !"
నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ

షూటింగ్ కు సిద్ధం - నితిన్
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్

నితిన్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ "
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ , నేహ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ హిట్ "జయం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ తన రెండవ మూవీ "దిల్" లో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కమెడియన్ వేణు మాధవ్ తన మిమిక్రీ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు.

ఇటలీ లో "రంగ్ దే !"
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెలకిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా "రంగ్ దే " మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
నితిన్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
భీష్మ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు నితిన్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగ్ దే సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ
మొత్తానికి టాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే పాత రోజులు వస్తున్నాయి. షూటింగ్‌లను స్టార్ట్ చేసి మళ్లీ కళకళాడుతోంది టాలీవుడ్. షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో చకచకా వచ్చి పూర్తి చేసుకుందామనే ఆలోచనలో పడ్డాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు షూటింగ్ ను మొదలు పెట్టారు...షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు కూడా. మరికొంతమంది ఇప్పుడిప్పుడే షూటింగ్ లను మొదలుపెడుతున్నారు.

షూటింగ్ కు సిద్ధం - నితిన్
"భీష్మ " మూవీ ఘన విజయం సాధించడంతో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ వరస మూవీస్ కు కమిట్ అయ్యారు. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో "చెక్ ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధా ధున్ " తెలుగు రీమేక్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో "పవర్ పేట " మూవీస్ లో నితిన్ నటిస్తారు.
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ ఈ ఏడాది శివరాత్రి రోజున విడుదలై సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస కళ్యాణం సినిమా పరాజయం తరువాత చాల గ్యాప్ తీసుకొని నితిన్ చేసిన సినిమా భీష్మ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.