ట్యాగ్ · 7 కథనాలు
మీరు చూసింది స్క్రాచ్ మాత్రమే -'V' లో చాలా ఉంది

'వి' మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

సెంటిమెంట్ - అప్పుడు అష్టా చమ్మా.. ఇప్పుడు 'V'
'వి' ట్రైలర్ చూసి మహేష్, కృష్ణ గారి రియాక్షన్ అదే
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన సినిమా ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సుధీర్ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మీరు చూసింది స్క్రాచ్ మాత్రమే -'V' లో చాలా ఉంది
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు కు బావగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన సుధీర్ బాబు తనకొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'వి' మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు ఇది 'వి' సినిమా ట్రైలర్ లో నాని చెప్పిన డైలాగ్. మరి నాని చెప్పిన ఎక్స్‌పెక్టేషన్స్ ను ఈ సినిమా రీచ్ అవుతుందా?లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. మొదట ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా పరిస్థితులు సహకరించకపోవడంతో ఓటీటీ లోనే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక రేపు అమెజాన్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎందుకు చూడాలో ఒకసారి చూద్దాం.
ఓటీటీ రిలీజ్ పై నాని - ఎవరో ఒకరు ధైర్యంగా స్టెప్ తీసుకోవాలి
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'వి' సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. వచ్చే నెల సెప్టెంబర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. ఇక ఓటీటీ లో తెలుగులో ఇప్పటివరకూ అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. ఇప్పటిదాకా ‘వి’ స్థాయి సినిమా ఏదీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.

"V" మూవీ సాంగ్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ "V" మూవీ పై అంచనాలను పెంచాయి.

'V' ట్రైలర్ - ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు
కరోనా వల్ల థియేటర్ లో విడుదలవ్వాల్సిన సినిమాలు ఓటీటీ దారిన పడుతున్నాయి. మొదట ఓ రెండు మూడు నెలల్లో మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారు అనుకున్నారు కానీ అసలు ఈ ఏడాది చివరి వరకూ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఇప్పటివరకూ హోల్డ్ లో పెట్టుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ కి వెళుతున్నాయి. అలా ఇన్ని రోజులు థియేటర్స్ కోసం వెయిట్ చేసి ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమానే 'వి'. వచ్చే నెల సెప్టెంబర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.

సెంటిమెంట్ - అప్పుడు అష్టా చమ్మా.. ఇప్పుడు 'V'
నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని…