
ట్యాగ్ · 6 కథనాలు


రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ
మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్
ఇద్దరు సోదరులు కలిసిన రోజు

నాగబాబు కామెడీ.. ఈరోజు నుండి నిహారిక నీ సమస్య..!

సాక్షి మూవీ లో నాగబాబు లుక్ రిలీజ్
శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై శివ కేశన కుర్తి దర్శకత్వంలో శరణ్ కుమార్ హీరోగా సాక్షి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాహ్నవి కపూర్.కథానాయిక కాగా అజయ్, ఇంద్రజ, ఆమని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో విలన్ గా మెగా స్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు నటిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ జరగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ - పెళ్లి పనుల్లో వరుణ్ బిజీ
త్వరలోనే మెగా డాటర్ నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది కూడా. ఇక కొద్దిరోజుల్లో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో నిహారిక బ్యాచిలర్ పార్టీ కూడా జరుపుకుంది. ఇక ఈ నేపథ్యంలో తన కూతురి పెళ్లి గురించి.. పనులు గురించి చెపుతూ చెపుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి కరోనా వల్ల చాలా నష్టం జరిగిపోయింది. దానికితోడు ఎంతో మంది లెజెండ్రీ నటీనటులు కూడా ఈ ఏడాదే కన్ను మూసారు. దానికితోడు కరోనా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ను టార్గెట్ చేసింది. అదేంటో షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా కూడా కరోనా సోకిన సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. లెజండరీ డైరెక్టర్ రాజమౌళి నుండి తేజ, డీవీవీ దానయ్య, తేజ, సింగర్ సునీత ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది.. ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు మరో సెలబ్రిటీకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు.
ఇద్దరు సోదరులు కలిసిన రోజు
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి చెపుతున్న సంగతి కూడా విదితమే. అయితే కొన్నిసార్లు.. కొన్ని విషయాలు వివాదాస్పదంగా మారిన రోజులు కూడా ఉన్నాయనుకోండి అది వేరే విషయం. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి నాగబాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా బాలకృష్ణ పోస్ట్.. ఆ పోస్ట్ ఏంటో మీరు కూడా ఒకసారి చూడండి.

నాగబాబు కామెడీ.. ఈరోజు నుండి నిహారిక నీ సమస్య..!
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం నిన్న జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం నిరాడంబరంగా జరిగింది. కోవిడ్ నిబంధనలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెగా, అల్లు కుటుంబాలతోపాటు.. చైతన్య తరపు కొంతమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. నిహారిక నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.