ఇద్దరు సోదరులు కలిసిన రోజు

When Nandamuri Balakrishna Meets Power Star Pawan Kalyan

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి చెపుతున్న సంగతి కూడా విదితమే. అయితే కొన్నిసార్లు.. కొన్ని విషయాలు వివాదాస్పదంగా మారిన రోజులు కూడా ఉన్నాయనుకోండి అది వేరే విషయం. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి నాగబాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా బాలకృష్ణ పోస్ట్.. ఆ పోస్ట్ ఏంటో మీరు కూడా ఒకసారి చూడండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

తన తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, నందమూరి నట సింహం బాలకృష్ణ కలిసి ఉన్న పాత ఫొటోను నాగబాబు తన ఇన్స్టా లో పోస్ట్ చేసి.. `ఇద్దరు సోదరులు కలిసిన రోజు.. మొదటి వ్యక్తి నా సోదరుడు. రెండో వ్యక్తి మరో సోదరుడు.. నందమూరి సింహాన్ని పవర్‌స్టార్ కలిసిన రోజు` అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. చూడబోతే ఈ ఫొటో ఏదో 90 ల్లో ఫొటోలాగానే కనిపిస్తుంది. ఏదో ఈవెంట్ లో పవన్, బాలకృష్ణ కలుసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

మరి గతంలో నాగబాబు బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే కదా. బాలకృష్ణ అంటే ఎవరో నాకు తెలీదు అని అప్పట్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత లాక్ డౌన్ తొలినాళ్లలో కూడా బాలకృష్ణ సినీ పెద్దలపై చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించి క్షమాపణలు చెప్పాలని కోరారు. ఇప్పుడు ఆ విషయాలు అందరూ మరిచిపోయారనుకోండి. అలాంటి నాగబాబు ఇప్పుడు సడెన్ గా బాలకృష్ణ… పవన్ కళ్యాణ్ ఫొటో పోస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటబ్బా అని ఆశ్చర్యపడుతున్నారు. మరి నార్మల్ గా పోస్ట్ చేశారా? ఏదైనా కారణం ఉందా? అది నాగబాబుకే తెలియాలి..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + seventeen =