కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Manchu Manoj

ట్యాగ్ · 7 కథనాలు

Manchu Manoj Tests Positive for Covid19,Manchu Manoj Tests Positive For COVID 19,Manchu Manoj Tested Positive for Covid-19,Manoj Manchu Tests Positive For COVID-19,Manchu Manoj Tests Positive For Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2021,Latest
సినిమా వార్తలు

మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్..!

మళ్లీ సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం చూపిస్తుంది. గత ఏడాది ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. ఇప్పుడు మళ్లీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక ఈవిషయాన్ని స్వయంగా మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ''నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల నుంచి నాతో కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి. అవసరమైన జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు'' అని మనోజ్‌ ట్వీట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మనోజ్ మంచు స్లిమ్ లుక్

"మేజర్ చంద్రకాంత్ "మూవీ లో బాలనటుడిగా పరిచయం అయిన మనోజ్ మంచు సూపర్ హిట్ "దొంగ దొంగది " మూవీ తో హీరోగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. "ఒక్కడు మిగిలాడు "(2017 ) మూవీ తరువాత మనోజ్ నటనకు గ్యాప్ తీసుకున్నారు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ నెలకొల్పారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "అహం బ్రహ్మస్మి "మూవీ లో హీరోగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగా - మంచు దీపావళి

మెగా ఫ్యామిలీ- మంచు ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు చిరు,మోహన్ బాబు సరదాగా కౌంటర్లు వేసుకున్నా రెండు ఫ్యామిలీస్ మధ్య బంధం వేరు. కేవలం ఈ రెండు ఫ్యామిలీస్ మాత్రమే కాదులెండి టాలీవుడ్ లో అక్కినేని,మెగా,నందమూరి, దగ్గుబాటి, మంచు ఫ్యామిలీస్ దాదాపు సన్నిహిత్యంగానే ఉంటాయి. ఇక హీరోస్ మంచు మనోజ్, చరణ్, ఎన్టీఆర్, రానా, మహేష్ వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ కూడా అందరికీ తెలుసు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!

మెగా హీరో సాయితేజ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖుల నుండి పుట్టిన రోజులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సాయి తేజ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే బాయ్ కు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృచ్చికంగా బ్లాక్ బస్టర్ 'బిల్లా రంగా' సినిమా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.. . ఇది మనకు ఏదో చెబుతోంది అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ.. నువ్వు రెడీయా` అని సాయితేజ్ ఫొటో, `బిల్లా రంగా` సినిమా పోస్టర్‌ను మనోజ్ ట్వీట్ చేశాడు. మరి దీనిపై సాయి తేజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా మంచు మనోజ్, సాయితేజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మనోజ్ హై కిక్ - సీరియ‌స్ వర్కౌట్స్

చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా 'అహం బ్రహ్మస్మి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఇంత వరకూ షూటింగ్ ప్రారంభించలేదు కానీ.. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేసేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నా మనోజ్ మాత్రం మంచి కథతో వస్తున్నాడన్న హోప్స్ పెంచాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మనోజ్ మంచు సినీ జర్నీ

విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మనోజ్ మంచు "దొంగ దొంగది " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "దొంగ దొంగది " మూవీ 2004 సంవత్సరం ఆగస్ట్ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "శ్రీ ", "నేను మీకు తెలుసా ?", "బిందాస్ ", "వేదం ", కరెంట్ తీగ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత మనోజ్ "అహం బ్రహ్మస్మి " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వియ్యంకుడు తేజ్ కు థ్యాంక్స్.. త్వరలోనే ముహుర్తాలు..!

వియ్యంకుడు.. త్వరలోనే ముహుర్తాలు అంటేసాయి తేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడేమో అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటటే.. మంచు మనోజ్ హ్యూమర్ గురించి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక్కోసారి తను పెట్టె పోస్ట్ లు చాలా కామెడీ గా ఉంటాయి. తాజాగా అలాంటి ట్వీటే చేసాడు. మనోజ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమ పెంపుడు కుక్కులకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సోషల్ డిస్టెన్స్ తో.. టాంగో మరియు జోయాడేట్ డే... నాకు మంచి అల్లుడు ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు. త్వరలోనే ముహూర్తలు పెట్టించి శుభలేఖలు వెయిస్తాం” అని సరదాగా పోస్ట్…

TFN Adminవాట్సాప్

షేర్