
ట్యాగ్ · 6 కథనాలు


విశాల్ 'ఎనిమి' ట్రైలర్ రిలీజ్

దసరా కు రిలీజ్ కానున్న 'ఎనిమి'

రామ్ కు విలన్ గా..!

'అంతఃపురం' ట్రైలర్ రిలీజ్
సుందర్ సి. తమిళంలో 'అరణ్మనై' టైటిల్ తో వరుస సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ 'అరణ్మనై1', 'అరణ్మనై2' సినిమాలు వచ్చాయి. తెలుగులో కళావతి, చంద్రకళ టైటిల్స్ తో ఈసినిమాలు రిలీజ్ అయ్యాయి. హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కాబట్టి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఇదే సిరీస్ లో భాగంగా 'అరణ్మనై 3' సినిమా కూడా వస్తుంది. ఆర్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'అంతఃపురం' టైటిల్ తో విడుదల అవుతుంది.

విశాల్ 'ఎనిమి' ట్రైలర్ రిలీజ్
హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఎనిమి సినిమా కూడా ఒకటి. విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఎనిమి’. వాడు వీడు సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో చిత్రయూనిట్ మొదలుపెట్టింది కూడా. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు…

విశాల్ 'ఎనిమి' డబ్బింగ్.. ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా వస్తున్న సినిమా ఎనిమి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇక తాజాగా విశాల్ ఈసినిమా తెలుగు డబ్బింగ్ చెబుతున్నవీడియో ఒకటి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అంతేకాదు తెలుగులో డబ్బింగ్ చెబుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా చేస్తున్నట్టు ఉంది అంటూ తన మీద తానే కామెంట్ వేసుకున్నాడు.

దసరా కు రిలీజ్ కానున్న 'ఎనిమి'
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం అందరూ సినిమాలు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలన్నప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు. డేట్అయితే చెప్పలేదు కానీ దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

రామ్ కు విలన్ గా..!
ఒకప్పుడు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ మధ్య ఫుల్ మాస్ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో అలరించిన రామ్.. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసాడు. ఇప్పుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈసినిమాకు 'ఉస్తాద్' అనే పేరును చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాలో నటించే విలన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలోనే తమిళ్ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్నాడని…
"పుష్ప" మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా తమిళ హీరో ఆర్య ?
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , సునీల్ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.