
ట్యాగ్ · 7 కథనాలు


చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ

సంక్రాంతికి షిఫ్ట్ అయిన ఆచార్య..!

'ఆచార్య' టాకీ పార్ట్ కంప్లీట్

"ఆచార్య "మూవీ లో సోనూసూద్ లుక్

ఆచార్య ఫైనల్ షెడ్యూల్ లో 'సిద్ధ'

మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

'ఆచార్య' పూజా లుక్ రిలీజ్
ముకుందా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూజాహెగ్డే కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బందులే ఎదుర్కొంది. ప్రారంభంలో చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో పలు కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత అపజయాలను కూడా పట్టించుకోకుండా కెరీర్ లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండియాలోనే బిజీ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమా చేస్తూనే మరోపక్క హిందీ, తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ
సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సంక్రాంతికి షిఫ్ట్ అయిన ఆచార్య..!
కొన్నిపెద్ద సినిమాల రిలీజ్ ల విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకుండా పోయింది. చిన్న సినిమాలు ఈ ఏడాది చివరి లోపు దాదాపు అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే పోటీ మొదలైంది. చాలా సినిమాలు ఇప్పటికే లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు మరో సినిమా కూడా పొంగల్ రేసులోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఆసినిమా మరేదో కాదు కొరటాల దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి సినిమా ఆచార్య. నిజానికి ఈసినిమా ఈనెలలో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.

'ఆచార్య' టాకీ పార్ట్ కంప్లీట్
మెగాస్టార్చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కరోనా వల్ల బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈసినిమా తిరిగి మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. అన్నీ పరిస్థితులు బావుండే ఈనెల 13 న ఈసినిమా రిలీజ్ అయ్యేది కానీ కరోనా వల్ల అది కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

"ఆచార్య "మూవీ లో సోనూసూద్ లుక్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్…

ఆచార్య ఫైనల్ షెడ్యూల్ లో 'సిద్ధ'
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసే కొరటాల ఈ సినిమా కోసం కూడా అలాంటి కథనే సిద్ధం చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం కోకాపేట లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. ఈషూట్ లో చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసందర్భంగా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు చరణ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పదిహేను రోజుల పాటు కంటిన్యుయస్‌గా జరిగే ఈ…

మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్
ఈరెండు రోజులు మెగా ఫ్యామిలీ కి పండగే. రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈరోజు నుండే సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ సందడి చేస్తున్నారు. ఇక అభిమానులకు రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్ కు ఒక రోజు ముందే తను నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉండగా మరో రెండు రోజులు మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈవిషయం ఎవరో కాదు చరణ్ స్వయంగా అభిమానులతో చెప్పడంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు.